Mon Dec 23 2024 19:54:30 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine Crisis : ఎయిర్ పోర్టులు కిటకిట.. బయటపడేదెలా?
ఉక్రెయిన్ నుంచి బయట పడేందుకు ఎయిర్ పోర్టులకు పరుగులు తీస్తున్నారు. అన్ని ఎయిర్ పోర్టులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి
ఉక్రెయిన్ నుంచి బయట పడేందుకు ఎయిర్ పోర్టులకు పరుగులు తీస్తున్నారు. ఉక్రెయిన్ లోని అన్ని ఎయిర్ పోర్టులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్ పోర్టుతో పాటు దేశంలోని అనేక ఎయిర్ పోర్టుల నుంచి దేశం విడిచి వెళ్లేందుకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. బాంబుల మోతతో మోతెక్కి పోతున్న ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
రద్దు కావడంతో....
కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం ఎయిర్ స్పేస్ మూసివేయడంతో అన్ని విమానాలు రద్దయ్యాయి. దీంతో ఎయిర్ పోర్టులోనే వేలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. విమానాలకు అనుమతివ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. పారా ట్రూపర్స్ ను వేల సంఖ్యలో ఉక్రెయిన్ లోకి రష్యా దింపడంతో మరింత ఉద్రిక్తంగా మారింది. వైమానిక దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దేశం విడిచి వెళ్లిపోవడానికి ఆకాశమార్గాలు మూసుకు పోవడంతో కొందరు సొంత వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఎవరూ రావద్దని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ తలదాచుకోవడానికి కూడా స్థలం లేదని తెలిపింది. ఇంకా ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు.
Next Story