Mon Dec 23 2024 20:14:22 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine Crisis : ఆగని బాంబు దాడులు....వణికిపోతున్న జనం
రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజలు వణికిపోతున్నారు. రాజధాని కివ్ తో పాటు ప్రధాన నగరాలను రష్యా టార్గెట్ చేసింది
రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజలు వణికిపోతున్నారు. ఒక్కసారిగా విరుచుకుపడి రాజధాని కివ్ తో పాటు ప్రధాన నగరాలను టార్గెట్ చేసింది. రాజధాని కీవ్ కు సమీపంలోకి రష్యా సైన్యం చేరుకుంది. ఇప్పటికే రెండు ఎయిర్ పోర్టులను రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా దాడిలో నలభై మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందారని అధికారికంగా ఉక్రెయిన్ ప్రకటించింది. మరో పది మంది పౌరులు మరణించారని తెలిపింది. పది రష్యా యుద్ధ విమానాలను తమ సైనికులు కూల్చివేశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు.
జనావాసాలపై....
రష్యా దాడులు జనావాసాలపై కూడా జరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. లూహాన్స్క్ ప్రాంతంలోని రెండు పట్టణాలు వేర్పాటు వాదుల అధీనంలోకి వెళ్లాయి. కీవ్ లో బాంబ్ వార్నింగ్ సైరన్ లు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ బాంబ్ షెల్టర్లలో తలదాచుకోవాలని ప్రభుత్వం సూచించింది.
దౌత్య సంబంధాలపై.....
ఇక ఈరోజు తెల్లవారు జాము నుంచి ప్రారంభమైన యుద్ధంతో ఉక్రెయిన్ రష్యాతో తమ దేశానికి ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. తమ భూభాగంలోని రష్యా సేనలు చొచ్చుకు రావడంతో దౌత్య సంబంధాలను తెంచుకున్నామని జెలెన్ స్కీ తెలిపారు. ప్రపంచ దేశాలు తమకు అండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు. పశ్చిమ దేశాల నుంచి రక్షణ సాయం కావాలని ఆయన కోరారు.
Next Story