Mon Dec 23 2024 11:47:35 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ అత్యున్నతస్థాయి సమావేశం.. కీలక నిర్ణయం
ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా భేటీ అయ్యారు. భారతీయులను రప్పించే ఏర్పాట్లను ఆయన సమీక్షించారు
ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను రప్పించే ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థులపై దాడి జరిగింది. ఈ దాడి విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వీలయినంత త్వరగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను రప్పించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. పోలండ్ నుంచి తీసుకురావడం కష్టతరంగా మారిందని అధికారులు తెలిపారు. సరిహద్దు దేశాలు ట్రాన్సిట్ వీసాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కేంద్ర మంత్రులను ....
ఇక ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులను వెళ్లాల్సిందిగా ప్రధాని మోదీ ఆదేశించారు. హంగేరీ, పోలాండ్, రొమేనియా, స్వోవేకియా దేశాలకు వెళ్లాలని కేంద్ర మంత్రులను మోదీ కోరారు. ఉక్రెయిన్ పొరుగు దేశాల సహకారం తీసుకోవాలని, సరిహద్దు దేశాలతో మరింత సమన్వయం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్ లో భారతీయుల భద్రత, వారిని వెనక్కు తీసుకురావడంపైనే ప్రధాని అత్యున్నత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ తో పాటు పలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story