Fri Nov 22 2024 23:02:15 GMT+0000 (Coordinated Universal Time)
ఉక్రెయిన్ కు మద్దతుగా నటి ప్రియాంక చోప్రా పోస్ట్
ఉక్రెయిన్ లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. అమాయక ప్రజలు తమతోపాటు, తమ వారి ప్రాణాల గురించి ఆందోళన చెందుతున్నారు...
ముంబై : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. నిన్నటి నుంచి రష్యా ఉక్రెయిన్ పై వరుస దాడులు చేస్తోంది. తొలిరోజు యుద్ధంలో 137 మంది సైనికులను పోగొట్టుకున్నామని, తమ దేశాన్ని అందరూ ఒంటరిని చేశారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులు నెట్టింట్లో వీడియోల రూపంలో బయపడుతున్నాయి. ఆ వీడియోలు ప్రపంచ దేశాలను కంటతడి పెట్టిస్తున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు రష్యాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి ప్రియాంక చోప్రా ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు పలికింది. అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తెలియజేసే ఒక వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ పేజ్ పై పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఉక్రెయిన్ ప్రజలు ప్రాణ భయంతో సబ్ వే స్టేషన్లు, బంకర్లలో తలదాచుకోవడం అందులో కనిపిస్తుంది.
"ఉక్రెయిన్ లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. అమాయక ప్రజలు తమతోపాటు, తమ వారి ప్రాణాల గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో ఈ తరహా విపత్కర పరిస్థితులను ఊహించలేము. ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందనకు దారితీసే పరిస్థితి ఇది. యుద్ధం జరుగుతున్న చోట అమాయక ప్రజలున్నారు. వారు మీలాంటి వారు, నాలాంటి వారే. ఉక్రెయిన్ ప్రజలకు ఎలా సాయపడాలో తెలియజేసే మరింత సమాచారాన్ని తెలియజేసే నా బయో లింక్ ఇదే" అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్ ప్రజలకు సాయం చేయాలనుకునే వారు యునిసెఫ్ కు విరాళం ఇవ్వాలని ప్రియాంక సూచించారు.
News Summary - Priyanka Chopra requests help for Ukraine amid Russian invasion: ‘There are innocent lives in this war zone’
Next Story