Tue Dec 24 2024 03:13:32 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine : యుద్ధం మొదలు.. ఉక్రెయిన్ ఎదురు దాడులు
ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించింది. సైనికులను మొహరించింది. కాల్పులను ప్రారంభించడంతో ఉక్రెయిన్ అప్రమత్తమయింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించింది. సైనికులను పెద్దయెత్తున మొహరించింది. కాల్పులను ప్రారంభించడంతో ఉక్రెయిన్ అప్రమత్తమయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా బాంబులతో దాడులకు దిగింది. దీంతో ఉక్రెయిన్ కూడా తమ బలగాలను మొహరించే ప్రక్రియను చేపట్టింది. తాము ముందుగా దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. రెండో ప్రణాళికగానే బలగాలను తాము దించుతామని జెలెన్ స్కీ చెప్పారు.
ఐక్యరాజ్యసమితి బాధ్యత...
పుతిన్ పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించారని జెలెన్ స్కీ తెలిపారు. ఇది పూర్తిగా దురాక్రమణ చర్యే అని ఆయన అభిప్రాయపడ్డారు. జెలెన్ స్కీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు. మద్దతుగా ఉంటానని భరోసా ఇచ్చారు. రష్యా శాంతియుత నగరాలపై దాడులకు పాల్పడుతుందని జెలెన్ స్కీ తెలిపారు. యుద్ధాన్ని నివారించడం ఐక్యరాజ్యసమితి బాధ్యత అని జెలెన్ స్కీ తెలిపారు. ఉక్రెయిన్ పై దాడులను ఐరోపా దేశాలను ఖండించాయి. మరోవైపు ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. అందరూ ఇళ్లల్లోనే ఉండాలని ఆయన దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు.
నాటో దేశాలు....
ఉక్రెయిన్ కు ఇప్పటికే బ్రిటన్, అమెరికాలు మద్దతు ప్రకటించాయి. నాటో దేశాలు కూడా రష్యా దుందుడుకు వైఖరిని నిరసిస్తున్నాయి. చర్చల ద్వారా కాకుండా చర్యలకు దిగడాన్ని నాటో దేశాలు తప్పుపడుతున్నాయి. ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో పాటు బాల్టిక్ దేశాల్లో అమెరికా సైనికులను మొహరించింది. 800 మంది సైనికులను, 400 యుద్ధవిమానాలను అమెరికా మొహరించింది. అయితే తాము రష్యాతో యుద్ధానికి దిగే ఆలోచనలో లేమని, ఆత్మరక్షణ కోసమే బలగాలను మొహరించామని అమెరికా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు.
Next Story