Sat Nov 23 2024 00:42:37 GMT+0000 (Coordinated Universal Time)
న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా రష్యా దాడులు
తాజాగా రష్యా ఉక్రెయిన్ లోని అణు విద్యుత్ కేంద్రం టార్గెట్ గా బాంబు దాడులకు దిగింది.
ఉక్రెయిన్ పై రష్యా వార్ కొనసాగుతూనే ఉంది. ఒక వైపు చర్చలు మరో వైపు యుద్ధం కొనసాగుతుండటం విశేషం. తాజాగా రష్యా ఉక్రెయిన్ లోని అణు విద్యుత్ కేంద్రం టార్గెట్ గా బాంబు దాడులకు దిగింది. దీంతో ఇక్కడ మంటలు చెలరేగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయిన ఎనర్హోదర్ నగరంలోని జపోరిజ్జియా కేంద్రంపై రష్యా దాడులు చేసింది.
అంతర్జాతీయంగా ఆందోళన...
దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఈ ప్లాంట్ వినియోగంలో లేకున్నప్పటికీ అక్కడ అణు ఇంధనం నిల్వలు ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది పెను విధ్వంసానికి దారి తీసే అవకాశముందని ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తుననాయి. ఈ అణు విద్యుత్తు కేంద్రం పేలితే చెర్నో బిల్ పేలుడు కంటే పది రెట్లు నష్టం ఎక్కువగా ఉంటుందని, జరిగే నష్టం అంచనా కూడా వేయలేమని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది.
Next Story