Mon Dec 23 2024 12:11:08 GMT+0000 (Coordinated Universal Time)
బంకర్ లోకి వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. అక్కడున్న ఉక్రెయిన్ కార్యాలయాలపై రష్యా జెండాలు ఎగురవేశారు. రష్యా బలగాలు కీవ్ ను..
రెండ్రోజులు రష్యా బలగాలు ఉక్రెయిన్ పై దాడి చేస్తూనే ఉన్నాయి. రష్యా దాడిని ఎదుర్కోలేని ఉక్రెయిన్.. యుద్ధంపై చేతులెత్తేసింది. చర్చలకు సిద్ధమంటూ రష్యాకు సంకేతాలు పంపుతోంది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. అక్కడున్న ఉక్రెయిన్ కార్యాలయాలపై రష్యా జెండాలు ఎగురవేశారు. రష్యా బలగాలు కీవ్ ను ఆక్రమించేందుకు వచ్చిన నేపథ్యంలో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాధ్యక్షుడైన జెలెన్ స్కీ ని బంకర్ లోకి తరలించినట్లు సమాచారం. ఆయనను కాపాడుకునేందుకే ఈ పనిచేస్తునట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులపై వీరిద్దరూ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బుకారెస్ట్, రొమేనియా దేశాలకు రెండు ప్రత్యేక విమానాలను పంపుతోంది. రేపు హంగరీ రాజధాని బుడాపెస్ట్ కు ఓ విమానాన్ని పంపుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని, దారి ఖర్చులకు అవసరమైనంత డబ్బు, డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను కంపల్సరీ వెంట ఉంచుకోవాలని భారత్ ఎంబసీ సూచించింది. అలాగే విద్యార్థులు వచ్చే వాహనాలకు ఖచ్చితంగా భారత జెండా ఉండేలా చూసుకోవాలని తెలిపింది.
Next Story