Mon Dec 23 2024 00:00:12 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : పుతిన్ కు జో బైడెన్ వార్నింగ్
రష్యాను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు దుర్మార్గమని అభిప్రాయపడ్డారు.
రష్యాను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. పుతిన్ ను ప్రపంచం ఏకాకిని చేయాలని జోబైడెన్ పిలుపునిచ్చారు. అమెరికా గగనతలంలో రష్యా విమానాలను నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్ కు అమెరికా అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఉక్రెయిన్ లోని ప్రతి అంగుళాన్ని కాపాడతామని జో బైడెన్ హామీ ఇచ్చారు.
మూల్యం చెల్లించుకోక తప్పదంటూ....
ఉక్రెయిన్ పై దాడులకు పుతిన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింప చేస్తామని చెప్పారు. ఉక్రెయిన్ ను రష్యా ఏ విధంగా బలహీనరపర్చలేదని జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ కు ప్రపంచదేశాలన్నీ అండగా ఉంటాయని ఆయన తెలిపారు. రష్యా ఒంటెత్తు పోకడలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ పరిణామాలపై జో బైడెన్ ప్రసంగించారు.
- Tags
- joe bidenr
- putin
Next Story