Mon Dec 23 2024 10:50:18 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine war : అదే జరిగితే అణ్యాయుధాలతోనేనట
మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది అణ్వాయుధాలతోనే జరుగుతుందని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్టీ లావ్రోస్ చెప్పారు
ఉక్రెయిన్ పై రష్యా ఏడోరోజు యుద్ధం కొనసాగిస్తుంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడులను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. రష్యాపై అనేక ఆంక్షలను విధించాయి. ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయడానికి కూడా అనేక దేశాలు ముందుకు వచ్చాయి. ఏడు రోజుల నుంచి రష్యా సైన్యానికి ఎదురొడ్డి ఉక్రెయిన్ సైనికుల పోరాడుతున్న తీరును అమెరికా సయితం అభినందించింది.
మూడో ప్రపంచ యుద్ధంలో....
అయితే ఇదే సమయంలో ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అణ్వాయుధాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అదే జరిగితే ఆ యుద్ధం అణ్వాయుధాలతోనే జరుగుతుందని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్టీ లావ్రోస్ చెప్పారు. ఆంక్షలకు రష్యా సిద్ధంగా ఉందని, అణ్వాయుధాలను సమీకరించేందుకు ఉక్రెయిన్ ను అనుమతించబోమని రష్యా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
Next Story