Mon Dec 23 2024 11:38:23 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : నా కూతురిని కాపాడండి
ఉక్రెయిన్ లో ఉంటున్న తన కుమార్తెను కాపాడాలని మంచాల మండలానికి చెందిన సాయిబాబా కోరారు.
ఉక్రెయిన్ లో ఉంటున్న తన కుమార్తెను కాపాడాలని మంచాల మండలానికి చెందిన సాయిబాబా కోరారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. మంచాల మండలానికి చెందిన సాయిబాబా కూతురు వైష్ణవి వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం కారణంగా అక్కడే రెండు రోజుల నుంచి హాస్టల్ లో ఉంటున్నట్లు సాయిబాబా తెలిపారు.
తిండీ తిప్పలు లేకుండా..
హాస్టల్ లో ఉంటున్న తమ కుమార్తె వైష్ణవికి తిండి కూడా లభించడం లేదని, మరికొందరు విద్యార్థులు కూడా అనేక అవస్థలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తన కూతురితో పాటు భారతీయ విద్యార్థులందరినీ కాపాడాలని సాయిబాబా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
Next Story