Mon Dec 23 2024 06:29:57 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : నేడు చర్చలు ప్రారంభం
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య రెండో విడత చర్చలు నేడు ప్రారంభం కానున్నాయి
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య రెండో విడత చర్చలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలి విడత చర్చలు బెలారస్ లో ప్రారంభమై అసంతృప్తిగా ముగిసిన నేపథ్యంలో నేడు మరోసారి చర్చలు జరపాలని ఇరు దేశాలు ముందుకు వచ్చాయి. ఇరు దేశాల విదేశాంగ అధికారులు ఈ చర్చలకు హాజరుకానున్నారు. మరోవైపు యుద్ధం ఏడో రోజు కొనసాగుతూనే ఉంది. రష్యా సైనికులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
యుద్ధం ....
దీనికి ఉక్రెయిన్ బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. తాము రష్యాకు తలవంచే ప్రసక్తిలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ఈయూ దేశాల్లో కూడా సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యుద్దం కొనసాగుతుండగానే చర్చలు జరుగుతుండటం విశేషం. ఈరోజు చర్చలైనా ఫలప్రదమయి శాంతి నెలకొలాలని కోరుకుంటున్నారు.
Next Story