Mon Nov 18 2024 09:26:49 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో ఉక్రెయిన్ - రష్యా చర్చలు
ఉక్రెయిన్ - రష్యాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. బెలారస్ లో రెండు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు భేటీ కానున్నారు
ఉక్రెయిన్ - రష్యాల మధ్య చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. బెలారస్ లో రెండు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు వెళ్లాలని రెండు దేశాలు అంగీకరించడంతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే కీవ్ లో వారంతపు కర్ఫ్యూను ఉక్రెయిన్ ప్రభుత్వం ఎత్తివేసింది. చర్చలు ప్రారంభమయిన తర్వాత దాడులు ఆపాలని ఉక్రెయిన్ కోరుతుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని బెలారస్ లో రెండు దేశాలకు చెందిన విదేశాంగ అధికారులు పాల్గొంటారు.
యుద్ధం మాత్రం....
చర్చలు ప్రారంభం కానుండటంతో కొంత శాంతి నెలకొలే అవకాశముందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఐదు రోజలవుతుంది. వేల సంఖ్యలో పౌరులు, సైనికులు మరణించారు. చర్చల కోసం ఇప్పటికే రెండు దేశాలకు చెందిన విదేశాంగ అధికారులు బెలారస్ కు చేరుకున్నారు. సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ లో రష్యా సైనికుల బాంబు దాడులను మాత్రం ఆపడం లేదు. ఇంకా రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది.
Next Story