Tue Nov 05 2024 14:41:12 GMT+0000 (Coordinated Universal Time)
రెండో విడత చర్చల్లోనే అంతే
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య రెండో విడత చర్చల్లో కొంత పురోగతి లభించింది.
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య రెండో విడత చర్చల్లో కొంత పురోగతి లభించింది. రెండు దేశాల ప్రధాన డిమాండ్లను పక్కన పెట్టి పౌరుల తరలింపును సులభతరంచేస్తూ నిర్ణయం తీసుకు్నాయి. రెండో విడత బెలారస్ లో ఇరు దేశాల విదేశాంగ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలలో ప్రధానంగా సాధారణ పౌరులను తరలింపునకు ప్రత్యేక క్యారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
పౌరులను తరలించేందుకు....
ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధంలో సామన్య పౌరులు మరణిస్తున్నారు. వారిని జనావాసాలపైన కూడా దాడులు జరుగుతుండటంతో పౌరులు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వీరు సురక్షితంగా ఇతర ప్రాంతాలకు చేరుకునేలా ప్రత్యేక క్యారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయంచారు. రష్యా మాత్రం తమ డిమాండ్లను అంగీకరించడంలో ఆలస్యం చేస్తే మరింత జాబితా పెరుగుతుందని హెచ్చరించింది. రెండో దఫా చర్చలు కూడా అనుకున్న స్థాయిలో ఫలవంతం కాలేదు. అర్ధాంతరంగానే ముగిశాయి.
Next Story