Tue Dec 24 2024 02:32:58 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : నియంత.. ఉన్మాది ఎవరి మాట వినడు
యుద్ధంతో ఇప్పటికిప్పుడు రష్యాకు వచ్చిన ఇబ్బంది లేకపోయినా, నాటో విధించిన ఆంక్షలతో దీర్ఘకాలంలో ఇబ్బంది పడక తప్పదంటున్నారు
నియంత రాజ్యమేలితే అంతే ఉంటుంది. నియంత అధీనంలో ఉన్న దేశం కష్టాలు పడాల్సిందే. రష్యా లో పౌరులు ఇప్పడు అదే జరుగుతుంది. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యా పౌరుల అభిప్రాయం ఇదే. నిజంగా యుద్ధం పూర్తి స్థాయిలో జరిగితే ప్రపంచం మరోసారి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అనేక దేశాలు ఆర్థికంగా కుంగిపోయే అవకాశముందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన హెచ్చరిస్తున్నారు.
నిర్ణయాధికారం రష్యాదేనా?
ఇప్పటికిప్పుడు రష్యాకు వచ్చిన ఇబ్బంది లేకపోయినా, నాటో విధించిన ఆంక్షలతో దీర్ఘకాలంలో ఇబ్బంది పడక తప్పదంటున్నారు. యుద్ధం అనేది తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి ఉంది. స్వతంత్ర దేశాలు ఎవరితో ఉండాలన్నది ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. తాము కోరుకున్న దేశాలతో మైత్రిని కొనసాగించవచ్చు. లేకపోతే లేకపోవచ్చు. రష్యా చెప్పినట్లు నడుచుకోవాలంటే ఎలా అన్న ప్రశ్నలు అంతర్జాతీయ సమాజం నుంచి విన్పిస్తున్నాయి.
ఆ తపనతోనే...
అమెరికాతో దీటుగా అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలన్న తహతహ.. తపనతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యుద్ధానికి సిద్ధమయ్యారన్న ఆరోపణలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. 21వ శతాబ్దంలో యుద్ధాన్ని ఏ దేశం మద్దతివ్వదు. తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం పుతిన్ యుద్ధానికి దిగారు. తనను, తన దేశాన్ని ఎవరూ గుర్తించడం లేదన్న ఏకైక కారణంగానే పుతిన్ ఈ యుద్ధానికి దిగారన్నది వాస్తవం.
అంతర్జాతీయంగా....
ఉక్రెయిన్ లో దశాబ్దాల క్రితమే రెఫరెండం నిర్వహించారు. 95 శాతం మంది ప్రజలు తమ దేశం స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు. ఇన్నేళ్లు మౌనంగా ఉన్న రష్యా ఈ యుద్ధానికి దిగడం కేవలం దురహంకారమేనని అంటున్నారు. నాటోలో సభ్యత్వం కోరడమే ఉక్రెయిన్ చేసిన పాపమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. రష్యా కేవలం ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడానికే ఈ దాడులకు దిగింది. అంతర్జాతీయంగా పుతిన్ తన గౌరవాన్ని కోల్పోయినట్లయిందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒక దురహంకారి, నియంత చేతుల్లో దేశం ఉంటే ఇలాగే ఉంటుంది. యుద్ధానికి పూర్తి స్థాయిలో దిగితే దీర్ఘకాలంలో నష్టపోయేది రష్యా అన్నది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
Next Story