Mon Dec 23 2024 01:14:00 GMT+0000 (Coordinated Universal Time)
విసిగిపోయాను... తగ్గడమే మంచిదేమో
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య భీకర పోరు సాగుతుంది. పథ్నాలుగు రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది.
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య భీకర పోరు సాగుతుంది. పథ్నాలుగు రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ కు సాయంగా వచ్చిన వారు లేరు. నాటో దేశాలు కూడా ముఖం చాటేశాయి. రష్యాపై ఆంక్షలు విధించడం మినహా మరే రకంగా ఉక్రెయిన్ కు సాయపడలేదు. ఫలితంతా వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తి నష్టం జరిగింది.
నాటో దేశాలను....
యుద్ధానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ నాటో దేశాల సభ్యత్వాన్ని కోరడమే. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు, ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. నాటో సభ్యత్వం కూడా తాను కోరుకోవడం లేదని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. యుద్ధం తర్వాత పరిస్థితులు తనకు పూర్తి అవగాహన తెప్పించాయని ఆయన అన్నారు.
అధ్యక్షుడిగా కూడా....
నాటో దేశాలు వివాదాస్పద అంశాల జోలికి వెళ్లేందుకు బయపడుతున్నాయన్నారు. రష్యాతో తలపడేందుకు నాటో దేశాలు సిద్ధంగా లేవని, తాను ఇక ఎవరినీ బతిమాలదలుచుకోలేదన్నారు. ఈ పరిస్థితుల్లో తానే తగ్గడం మంచిదని జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ ఆత్మగౌరవాన్ని కాపాడతానని చెప్పారు. తాను కూడా ఇక అధ్యక్షుడిగా ఉండదలచుకోలేదని జెలెన్ స్కీ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో రష్యాతో శాంతి చర్చలకు జెలెన్ స్కీ సిద్ధమయ్యారు. రష్యా షరతులకు తలొగ్గేలా కన్పించారు. దీనిపై జెలెన్ స్కీ నుంచి స్పష్టమైన ప్రకటన వస్తే చర్చల్లో పురోగతి ఉంటుంది.
Next Story