Mon Dec 23 2024 10:32:32 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : జఫ్రోజియా ప్లాంట్ ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం
జఫ్రోజియా అణు విద్యుత్తు కేంద్రాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. రష్యా అధీనంలోకి వెళ్లిన 24 గంటల్లోనే న పరం చేసుకుంది.
జఫ్రోజియా అణు విద్యుత్తు కేంద్రాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. రష్యా అధీనంలోకి వెళ్లిన 24 గంటల్లోనే తిరిగి ఉక్రెయిన్ తన పరం చేసుకుంది. నిన్న రష్యా జఫ్రోజియా అణువిద్యుత్తు కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ ప్లాంట్ ను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తుంది. ఉక్రెయిన్ కు అత్యధిక భాగం విద్యుత్తు సరఫరా ఈ ప్లాంట్ నుంచే సరఫరా అవుతుంది. పుతిన్ సేనలు వ్యూహాత్మకంగా దీనిని స్వాధీనం చేసుకున్నాయి.
24 గంటలలోపే.....
అయితే రష్యా స్వాధీనమైన 24 గంటల్లోపే ఉక్రెయిన్ సైన్యం తమ అధీనంలోకి తెచ్చుకుంది. యూరప్ లో అతి పెద్ద ప్లాంట్ జఫ్రోజియా అణువిద్యుత్తు కేంద్రం. ఈ ప్లాంట్ కోసం ఉక్రెయిన్, రష్యా సేనలు దాడులకు దిగుతున్నాయి. దీంతో ప్రాంతమంతా కాల్పుల మోతతో దద్దరిల్లుతుంది.
Next Story