Mon Dec 23 2024 01:20:22 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : లక్షల కోట్ల ఆస్తి నష్టం... కోలుకోవడం కష్టమేనా?
ఉక్రెయిన్ కోలుకోవడానికి చాలా రోజులు సమయం పట్టొచ్చు. యుద్ధం ఇంకా ముగియలేదు
ఉక్రెయిన్ కోలుకోవడానికి చాలా రోజులు సమయం పట్టొచ్చు. యుద్ధం ఇంకా ముగియలేదు. రష్యా అధీనమైనా ఆ దేశం పూర్వపు స్థితికి చేరుకోవడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు సుమి, ఖార్కివ్, మరియుపోల్, చెర్నిహోవ్ వంటి నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. రష్యా నివాస ప్రాంతాలపై కూడా దాడులు చేయడంతో ఎటు చూసినా మొండి గోడలే కన్పిస్తున్నాయి.
పునర్నిర్మాణమేనా?
సగం కాలిపోయిన భవంతులతో పాటు కీవ్ ప్రధాన రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇక వాహనాల గురించి అయితే చెప్పనక్కర లేదు. ప్రజలకు చెందిన కార్లు పనికి రాకుండాపోయాయి. ఒక వేళ యుద్ధం ఆగినా ఉక్రెయిన్ కోలుకోవడానికి కొన్నేళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. రాజధాని కీన్ ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.
అందరికీ పరిహారం....
అందుకే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒక ప్రకటన చేశారు. యుద్ధంలో నష్టపోయిన ప్రయివేటు ఆస్తులకు కూడా పరిహారం చెల్లిస్తామని, అన్ని రకాలుగా బాధితులను ఆదుకుంటామని జెలెన్ స్కీ చెప్పారు. తాము తిరిగి నిలదొక్కుకోవడానికి ఆర్థిక సాయాన్ని కూడా అందజేయాలని జెలెన్ స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కోరారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలన్నీ ధ్వంసం కావడంతో లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
Next Story