Mon Dec 23 2024 06:27:14 GMT+0000 (Coordinated Universal Time)
రష్యా దాడుల్లో అలనాటి సినీ నటి మృతి
రష్యా - ఉక్రెయిన్ ల మద్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ నటి ఒక్సానా ష్వెట్స్ మృతి చెందారు
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ లో సాధారణ పౌరులు సయితం వేల సంఖ్యలో మరణించారు. ఇక సైనికుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. రష్యాకు చెందిన 17 వేల మంది సైనికులు ఈ ఇరవై రోజుల్లోనే మృతి చెందినట్లు అమెరికా ఇంటలిజెన్స్ పేర్కొంది. ఇంత పెద్ద స్థాయిలో సైనికుల మరణాలను తాము గతంలో ఏ యుద్ధంలోనూ చూడలేదని పేర్కొంది.
నివాస ప్రాంతాలపై....
అయితే తాజాగా ఈ యుద్ధంలో ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ నటి ఒక్సానా ష్వెట్స్ మృతి చెందారు. రష్యా నివాస ప్రాంతాలపై బాంబు దాడులు చేస్తుండటంతో ఒక్సానా ష్వెట్స్ మరణించారని అధికారిక ప్రకటన వెలువడింది. ఆమె వయసు 67 సంవత్సరాలు. దశాబ్దకాలాల పాటు ఆమె థియేటర్ ఆర్టిస్ట్ గా కొనసాగి, అనంతరం సినిమాల్లోనూ నటించారు. ఆమె మరణం ఉక్రెయిన్ లో విషాదాన్ని నింపింది.
Next Story