Mon Dec 23 2024 16:29:15 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : యుద్ధరంగంలోకి దిగిన జెలెన్ స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యుద్ధరంగంలోకి దిగారు. ఆయన తన సైనికులతో పాటు యుద్ధరంగంలో పాల్గొంటున్నారు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యుద్ధరంగంలోకి దిగారు. ఆయన తన సైనికులతో పాటు యుద్ధరంగంలో పాల్గొంటున్నారు. జెలెన్ స్కీ స్వయంగా యుద్దంలోకి దిగి సైనికులకు మరింత ఉత్సాహాన్ని నింపారు. జెలెన్ స్కీ రష్యా సైనికులతో నేరుగా పోరాడుతుండటాన్ని ఉక్రెయిన్ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే రష్యా సేనలు ఉక్రెయిన్ లోని దాదాపు 16 నగరాలను చుట్టుముట్టాయి. నగరాల్లో జెండాలను పాతుతున్నాయి.
పౌరులకు ఆయుధాలు...
అనేక మంది పౌరులు కూడా స్వచ్ఛందంగా యుద్ధంలోకి దిగి రష్యా సైనికులతో పోరాడుతున్నారు. ఈపోరాటంలో కొందరు అశువులు బాశారు కూడా. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారికి ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ యుద్ధంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ఆయుధాలను ఇచ్చింది. వారెవ్వరూ దేశం విడిచి వెళ్లకూడదని పిలుపునిచ్చింది.
ఆర్మీ దుస్తులు ధరించి.....
సామాన్య ప్రజలతో పాటు జెలెన్ స్కీ కూడా యుద్ధంలో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశం కోసం, ప్రజల కోసం తానున్నానంటూ జెలెన్ స్కీ తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దేశ అధ్యక్షుడైన జెలెన్ స్కీ సైనిక దుస్తులను ధరించి యుద్ధరంగంలోకి రావడంతో ఉక్రెయిన్ సైనికులు కూడా రష్యా సైనికులతో పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు.
Next Story