Thu Apr 03 2025 02:36:36 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine Crisis : తాము ఒంటరి పోరు చేస్తున్నాం
నాటో దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశం కూడా తమకు మద్దతుగా యుద్ధంలో నిలవడం లేదన్నా

నాటో దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క దేశం కూడా తమకు మద్దతుగా యుద్ధంలో నిలవడం లేదన్నారు. అన్ని దేశాలు రష్యా అంటే భయపడిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాపై యుద్ధంలో తాము ఒంటరి పోరును చేస్తున్నామని తెలిపారు. కాగా రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చేరుకున్నాయి. నాటో లో సభ్యత్వం ఎవరడిగారని ఆయన ప్రశ్నించారు.
రష్యాలో నిరసనలు...
మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలంటూ రష్యాలో నిరసనలు మొదలయ్యాయి. వేలాది మంది రోడ్లపైకి వచ్చి యుద్ధాన్ని ఆపాలంటూ పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పదిహేను వందల మంది ఆందోళనకారులను రష్యన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story