Wed Jan 08 2025 03:13:04 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : లొంగిపోయే ప్రసక్తి లేదు
రష్యాకు లొంగిపోయే ప్రసక్తి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. ఈయూ పార్లమెంటు సమావేశంలో ఆయన మాట్లాడారు
రష్యాకు లొంగిపోయే ప్రసక్తి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. ఆయన ఈయూ పార్లమెంటు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అసలు పుతిన్ లక్ష్యమేంటి అని ఆయన ప్రశ్నించారు. రష్యా సేనలతో తమ దేశ పౌరులు ధైర్యంగా పోరాడుతున్నారన్నారు. రష్యా దాడుల్లో తమ దేశ చిన్నారులు 16 మంది చనిపోయారన్నారు. తమ దేశంలో చిన్నారులు స్వేచ్ఛగా బతకాలని ఆశిస్తున్నానని జెలెన్ స్కీ తెలిపారు. ఈయూ పార్లమెంటులో జెలెన్ స్కీ ప్రసంగానికి దేశాధినేతలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ఆయనకు మద్దతు తెలిపారు.
తమ పిల్లల క్షేమమే....
ఈయూ దేశాలు తమకు మద్దతిస్తాయని భావిస్తున్నానన్నారు. తమ పిల్లలు క్షేమంగా జీవించాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన అన్నారు. తమ దేశాన్ని తామే కాపాడుకుంటామని చెప్పారు. తమ సత్తా ఏంటో నిరూపించుకుంటామని చెప్పారు. ఈ పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పారు. రష్యాకు భయపడే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ కు అండగా ఉంటామని ఈయూ పార్లమెంటు అధ్యక్షురాలు తెలిపారు.
Next Story