Tue Apr 22 2025 11:46:52 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోన్
భారత్ సాయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. ఈ సమయంలో తమకు అండగా నిలబడాలని మోదీని కోరారు

భారత్ సాయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. ఈ సమయంలో తమకు అండగా నిలబడాలని మోదీని కోరారు. భారత్ ప్రధాని నరేంద్రమోదీకి జెలెన్ స్కీ ఫోన్ చేసి సాయాన్ని కోరారు. తమ దేశంపై రష్యా దాడులు ఆపేలా చూడాలని జెలెన్ స్కీ మోదీని కోరారు.
స్నేహం దృష్ట్యా....
ఉక్రెయిన్ పై గత మూడు రోజుల నుంచి రష్యా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ సైనికులు కూడా చివర వరకూ పోరాడుతున్నారు. రాజధాని కీవ్ నగరంలోకి కూడా రష్యా సేనలు ఎంటర్ అయి ఆక్రమించుకునంేదుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు, ప్రధాని మోదీకి ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా జెలెన్ స్కీ ప్రధాని మోదీని సాయం చేయాలని కోరినట్లు తెలిసింది.
Next Story