Tue Apr 22 2025 05:13:00 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : బంకర్లలో లేను.. పోరాడుతూనే ఉన్నా
తాను బంకర్లో దాక్కున్నట్లు వచ్చిన వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఖండించారు.

తాను బంకర్లో దాక్కున్నట్లు వచ్చిన వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఖండించారు. తాను సైనికులతో కలసి దేశాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. కీవ్ నగరంలోకి రష్యన్ సేనలు ప్రవేశించాయని, అయితే వారిని ఉక్రెయిన్ సైన్యం, పౌరులు అడ్డుకుంటున్నారని జెలెన్ స్కీ వెల్లడించారు. తాను ప్రస్తుతం కీవ్ లోనే ఉన్నానని ఆయన చెప్పారు.
కీవ్ లోనే ఉండి.....
తాను కీవ్ లో ఉండి సైనికులతో కలసి దేశాన్ని రక్షించుకుంటానని ఆయన తెలిపారు. కీవ్ లోనే ఉండి తమ దేశ సాతంత్ర్యం కోసం పోరాడతామని చెప్పారు. ప్రత్యర్థి బలగాలను సమర్థవంతంగా తమ సేనలు ఎదుర్కొంటున్నాయని జెలెన్ స్కీ తెలిపారు. కాగా కీవ్ లోనే జెలెన్ స్కీ ఉండటంతో ఎక్కువ మంది సైనికులు ఆయన వద్దనే ఉన్నారని వీడియో ద్వారా తెలుస్తోంది
Next Story