Mon Dec 23 2024 06:38:02 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : ఉక్రెయిన్ కు అమెరికా భారీ సాయం
ఉక్రెయిన్ కు అమెరికా భారీగా ఆర్థిక సాయాన్ని అందించింది. 600 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది
ఉక్రెయిన్ కు అమెరికా భారీగా ఆర్థిక సాయాన్ని అందించింది. 600 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది. తక్షణ సైనిక అవసరావలకు ఇది వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఉక్రెయిన్ ను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభంచగానే అమెరికా రష్యాపై అనేక ఆంక్షలను విధించింది. దీంతో పాటు ఉక్రెయిన్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పేందుకు భారీ సాయాన్ని అమెరికా ప్రకటించింది.
కీవ్ నగరాన్ని....
మరోవైపు కీవ్ నగరాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యం వారిని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. కీవ్ నగరంపై బాంబు దాడులు చేస్తుండటంతో బీభత్స వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రెండు అమెరికా విమానాలను తాము గుర్తించామని రష్యా చెబుతుంది. జెలెన్ స్కీని తరలించేందుకు ఇవి వచ్చినట్లు రష్యా అనుమానిస్తుంది.
ఉక్రెయిన్ లెక్కలివీ....
3500 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. రష్యాకు చెందిన 14 విమానాలను, 8 హెలికాప్టర్లను కూల్చివేశామని చెప్పింది. 102 యుద్ధ ట్యాంకులు, 56 వాహనాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. తమ బందీలో 200 మంది రష్యన్ సైనికులు ఉన్నారని తెలిపింది. మూడో రోజు యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. బాంబుల మోతతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది.
Next Story