Mon Nov 25 2024 20:29:12 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : రూబుల్ ఢమాల్....ఇక కష్టమే
రష్యా కరెన్సీ రూబుల్ విలువ ఇప్పటికే పడిపోయింది. దానిని మరింత దిగజార్చాలన్నది అమెరికా వ్యూహంగా కన్పిస్తుంది
ప్రపంచ దేశాల ఆంక్షలతో రష్యా విలవిలలాడుతుంది. ఐరోపా దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అతి పెద్ద బ్యాంకు అయిన సెర్ బ్యాంకు మూతబడింది. సెర్ బ్యాంక్ లావాదేవీలు ఇప్పటికే స్థంభించి పోయాయి. దీంతో రష్యా ఆర్థికంగా ఇబ్బందులు పడక తప్పదంటున్నారు. ఇప్పటికే రష్యా కరెన్సీ విలువ పడిపోయింది. ప్రపంచ దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. చైనా కొంత మిత్రుడిగా ఉన్నప్పటికీ ఆంక్షల విషయంలో ఏమీ చేయలేకపోతుంది. భారత్ కూడా తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ఇక పుతిన్ ను ఒంటరి చేసే వ్యూహాన్ని అగ్రరాజ్యం అమెరికా మొదలు పెట్టింది.
ఆర్థికపరమైన ఆంక్షలతో....
అమెరికాకు నాటో కూటమి కూడా తోడయి రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. గతంలో ఇలాంటి ఆంక్షలు ఏ దేశంపై ప్రయోగించలేదని చెప్పారు. దీనివల్ల రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. రష్యా కరెన్సీ రూబుల్ విలువ ఇప్పటికే పడిపోయింది. దానిని మరింత దిగజార్చాలన్నది అమెరికా వ్యూహంగా కన్పిస్తుంది. చమురు, సహజవాయువుల ద్వారా సంపాదించిన 630 కోట్ల బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలను కట్టడి చేయనుంది.
స్విఫ్ట్ వ్యవస్థ నుంచి...
ప్రపంచంలోని 11 వేల బ్యాంకులకు అనుసంధానించే స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించడంతో కోలుకోలేని దెబ్బగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు రష్యాకు చెందిన డబ్బు నిల్వలు విదేశీ బ్యాంకుల్లో చిక్కుకుపోయాయి. రూబుల్ విలువ మరింత పడే అవకాశం కన్పిస్తుంది. ఉక్రెయిన్ తో యుద్ధం మాటేమో కాని పుతిన్ మాత్రం రష్యన్లకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టినట్లే కనపడుతుంది.
Next Story