Fri Apr 04 2025 20:32:33 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : 4,300 రష్యా సైనికులను మట్టుబెట్టాం
ఉక్రెయిన్ లో యుద్ధం నాలుగోరోజు కొనసాగుతుంది. రష్యన్ సైనికులను సమర్థవంతంగా ఉక్రెయిన్ ఎదుర్కొంటుంది

ఉక్రెయిన్ లో యుద్ధం నాలుగోరోజు కొనసాగుతుంది. రష్యన్ సైనికులను సమర్థవంతంగా ఉక్రెయిన్ ఎదుర్కొంటుంది. చర్చలకు రావాలని, ఆయుధాలను వీడాలని రష్యా పదే పదే చేస్తున్న సూచనలను ఉక్రెయిన్ పెద్దగా పట్టించుకోవడం లేదు, తుదికంటా పోరాడేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే కొన్ని నగరాల్లోకి రష్యన్ సేనలు ప్రవేశించాయి. అయితే వీరిని ప్రజలతో పాటు సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు.
ధ్వంసం చేసినవి ఇవే....
అయితే 4,300 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ప్రకటించింది. 49 ఫిరంగులు, 705 యుద్ధ సామాగ్రి ఫిరంగులు, బక్ సిస్టమ్స్, నాలుటు గ్రాడ్ సిస్టమ్స్ ను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. రష్యాకు చెందిన 30 కార్లు, రెండు డ్రోన్లు, రెండు గస్తీ నౌకలు, 60 ఇంథన నౌకలను ధ్వంసం చేశామని పేర్కొంది. దీంతో పాటు రష్యాకు చెందిన 27 యుద్ధ విమానాలను, 26 చాపర్లను, 146 యుద్ధ ట్యాంకర్లను నాశనం చేశామని ఉక్రెయిన్ ప్రభుత్వం పేర్కొంది. రష్యాతో చివరి వరకూ పోరాడతామని తెలిపింది.
Next Story