Mon Dec 23 2024 10:28:24 GMT+0000 (Coordinated Universal Time)
Ukrnaine War : భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు
ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 117 డాలర్లకు చేరింది
ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 117 డాలర్లకు చేరింది. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఉక్రెయిన్ - రష్యా మధ్య గత తొమ్మిది రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. చర్చలు జరుగుతున్నా అవి యుద్ధాన్ని నివారించేలా సాగడం లేదు. రష్యా ఉక్రెయిన్ పై దాడులను కొనసాగిస్తూనే ఉంది.
వ్యూహాత్మక నిల్వలను...
ఈ ప్రభావం క్రూడాయిల్ ధర పెరిగింది. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల వద్ద ఉన్న 3 కోట్ల బ్యారెల్ ల చమురును వ్యూహాత్మక నిల్వల నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. అయినా ముడి చమురు ధరల పెరుగుదల ఆగడం లేదు. దీని ప్రభావం త్వరలోనే పెట్రోలు, డీజిల్ పై పడనుంది.
Next Story