Mon Dec 23 2024 02:36:43 GMT+0000 (Coordinated Universal Time)
అతిపెద్ద కార్గో విమానం "మ్రియా"ను ధ్వంసం చేసిన రష్యా
మ్రియా అంటే.. ఉక్రెయిన్ భాషలో కల. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ఈ విమానం.. ఉక్రెయిన్ రాజధాని...
ఉక్రెయిన్ : రష్యా- ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం ఐదవ రోజుకి చేరింది. అక్కడ చిక్కుకున్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకొస్తోంది భారత ప్రభుత్వం. ఇంకా వేల మంది విద్యార్థులు తమను కూడా తీసుకెళ్లాలంటూ వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. తాజాగా రష్యా దళాలు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన "ఏఎన్-225 మ్రియా"ను ధ్వంసం చేశాయి. ఉక్రెయిన్ ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ ఈ విమానాన్ని తయారు చేసింది.
Also Read : నేడు ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం
మ్రియా అంటే.. ఉక్రెయిన్ భాషలో కల. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ఈ విమానం.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్ పోర్టుపై రష్యా దళాలు జరిపిన దాడిలో ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు. మ్రియాను ధ్వంసం చేయడంపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడిపై స్పందిస్తూ మ్రియాను పునర్ నిర్మిస్తామని స్పష్టం చేసింది. రష్యా ధ్వంసం చేసింది విమానాన్నే కానీ తమ మ్రియా ఎప్పటికీ నశించదని పేర్కొంటూ ట్విట్టర్ లో విమానం ఫొటోను షేర్ చేసింది.
Next Story