Mon Dec 23 2024 10:27:20 GMT+0000 (Coordinated Universal Time)
ఉక్రెయిన్ లో ఖైదీల అరాచకం.. పౌరులపై దాడులు, అత్యాచారాలు ?
విడుదలైన ఖైదీ మూకలు రష్యాపై యుద్ధం చేయకుండా ఉక్రెయిన్ పౌరులపైనే ఎదురుదాడులు చేసి, వారిని దోచుకుంటూ, ఆడవాళ్లపై..
ఉక్రెయిన్ : రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీసుకున్న నిర్ణయం ఆ దేశ పౌరులకే సమస్యగా మారిందా ? అంటే.. ఈ వీడియో చూస్తే అవుననే అనిపిస్తుంది. రష్యాను ఎదుర్కొనేందుకు, రష్యా పై పోరాటం చేసేందుకు ఆసక్తిగల పౌరులందరికీ ఆయుధాలు ఇస్తామని జెలెన్ స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యాపై పోరాడేందుకు సైనిక బలం సరిపోకపోవడంతో.. జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసి యుద్ధరంగంలోకి దింపారు.
కానీ.. విడుదలైన ఖైదీ మూకలు రష్యాపై యుద్ధం చేయకుండా ఉక్రెయిన్ పౌరులపైనే ఎదురుదాడులు చేసి, వారిని దోచుకుంటూ, ఆడవాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పౌరులకు ఇచ్చిన సైనిక ఆయుధాలు.. ఖైదీల చేతిలోకి వెళ్లడంతో ఇదంతా జరుగుతుందని ఉక్రెయిన్ రచయిత గొంజలో లిరా పేర్కొన్నారు. "జెలెన్ స్కీ యంత్రాంగం గడిచిన కొన్ని రోజులుగా సైనిక శ్రేణి ఆయుధాలను ఇస్తుండడంతో అవి చాలా మంది నేరస్థుల చేతికి వెళ్లాయి. దాంతో వారు దోపిడీలు, అత్యాచారాలు, అన్ని రకాల అరాచకాలకు పాల్పడుతున్నారు. కీవ్ లో గత రాత్రి వినిపించిన కాల్పులన్నీ కూడా రష్యన్లు చేసినవి కావు. రష్యా సైన్యం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవన్నీ నేరగాళ్ల గ్యాంగులు చేసినవే అయి ఉండొచ్చు" అని పేర్కొంటూ గొంజలో లిరా ఒక వీడియో విడుదల చేశారు.
Next Story