ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ప్రతీకార హెచ్చరికలు., భీకర ప్రతిజ్ఞల బదులు పాకిస్తాన్‌తో అర్థవంతమైన చర్చలు జరపాలని మజ్లిస్ పార్టీ డిమాండ్ చేసింది. సరిహద్దుల్లో ఎన్నాళ్లు సైనికుల్ని దేశభక్తి పేరుతో బలిచేస్తారని ఓవైసీ ప్రశ్నించారు. సరిహద్దుల్లో భారత సైనికుల్ని దారుణంగా హతమార్చిన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో చర్చలకు ఇదే సమయమని., ఎన్నాళ్లిలా ఉద్రేకపూరితమైన దేశభక్తి పేరుతో సమస్యను సాగదీస్తారని., ఇది ఎవరికి మంచిది కాదన్నారు. భారత సైనికుల తలలు నరకడం వెనుక పాక్ బోర్డర్ ఆర్మీ టీం దుశ్చర్య ఉందని భారత్ ఆరోపిస్తోంది. పాక్ సైనికులతో కలిసి వారు దాడి చేశారని చెబుతున్నారు. పూంచ్‌లోని కృష్ణఘాటీ సెక్టార్లో ఈ ఘటన జరిగింది. వాస్తవాధీన రేఖను దాటి 200మీటర్లకు పైగా చొచ్చుకు వచ్చి పాక్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని బిఎస్ఎఫ్ ప్రకటించింది. తాజా ఘటనపై దేశ వ్యాప్తంగా ఉద్విగ్న పరిస్థితులు నెలకొనడంతో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
- Tags
- అసదుద్దీన్