తెలుగుపోస్ట్ టాప్ 10 వార్తలు (6-5-2023)
కేబుల్ బ్రిడ్జి వద్ద విషాదం.. బ్రిడ్జిపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఈరోజ జరిగిన మ్యాచ్ ఎలాంటి ఉత్కంఠ లేకుండా సాగింది. చివరకు చెన్నై సూపర్ కింగ్స్‌నే విజయం వరించింది.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పంతం నెగ్గించుకున్న బాలినేని
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన పంతం నెగ్గించుకున్నాడు. ఒంగోలు డీఎస్పీగా అశోక్ రెడ్డి బదిలీని అడ్డుకున్నారు. ఆయన స్థానంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిని నియమించారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అర్థాంతరంగా మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ మృతి
గతేడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఫైనల్స్ వరకూ వెళ్లిన ఓ మోడల్ అర్థాంతరంగా కన్నుమూసింది. గుర్రపు స్వారీ రూపంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫ్యాషన్ మోడల్, మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియానా వేర్ (23) ను మృత్యువు ఆమెను కబళించింది.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విడాకులు వచ్చాయన్న ఆనందంలో బంగీజంప్.. మెడ, వెన్ను విరిగి
విడాకులు వచ్చాయన్న ఆనందంలో ఓ యువకుడు భంగీ జంప్ అనే సాహసక్రీడలో పాల్గొన్నాడు. అయితే అది అతనికి ఊహించని ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజాసింగ్‌కు నో ఎంట్రీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కొత్త సచివాలయంలో చేదు అనుభవం ఎదురయింది. రాజా సింగ్ ను సచివాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని ఆయనను వెనక్కు పంపారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సుప్రీంకోర్టుకు రాజధాని రైతులు
ఆర్5 జోన్‌పై నేడు సుప్రీంకోర్టును అమరావతి రైతులు ఆశ్రయించనున్నారు. స్పెషల్ లీవ్ పిటీషన్‌ను రైతులు వేయనున్నారు. హైకోర్టు జీవో నెంబరు 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రైతుల పిటీషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దంటే ఎలా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జోబెడైన్ సలహాదారుగా నీరా టాండన్
అమెరికా అధ్యక్షుడి సలహాదారుడిగా భారతీయ సంతతి మహిళ నియమితులయ్యారు. నీరా టాండన్ ను అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ సలహాదారుగా నియమించారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నేడు పట్టాభిషేకం
ఏడు దశాబ్దాల తర్వాత బ్రిటన్‌లో కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం జరగనుంది. ఇప్పటికే బ్రిటన్ రాజుగా నియమితులైన ప్రిన్స్ ఛార్లెస్‌కు కిరీటం పెట్టనున్నారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రేవంత్ సమక్షంలో చేరిక
కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేరికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి