ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతలకు అంత సీన్ లేదట…?
ఏపీ బీజేపీని ప్రొక్లెయిన్ పట్టి లేపినా లేచే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇక్కడ వారు ఎంత ఎదగాలని అనుకున్నా.. ఢిల్లీలోని నేతలు.. వీరికి సహకరించే [more]
ఏపీ బీజేపీని ప్రొక్లెయిన్ పట్టి లేపినా లేచే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇక్కడ వారు ఎంత ఎదగాలని అనుకున్నా.. ఢిల్లీలోని నేతలు.. వీరికి సహకరించే [more]
ఏపీ బీజేపీని ప్రొక్లెయిన్ పట్టి లేపినా లేచే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇక్కడ వారు ఎంత ఎదగాలని అనుకున్నా.. ఢిల్లీలోని నేతలు.. వీరికి సహకరించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా సీపీఐ నేత నారాయణ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కేంద్రంలో నెంబర్ 2గా ఉన్న మంత్రి అమిత్ షా దగ్గర జగన్కు మంచి యాక్సస్ ఉందని.. ఏపీ విషయంలో బీజేపీ నేతలు ఎంత చించుకున్నా.. ఆయన నమ్మడం లేదని.. అందుకే ఇప్పటికే జగన్పై ఏపీ బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదులను కూడా బుట్టదాఖలు చేశారని.. అన్నారు. వాస్తవానికి సోము వీర్రాజు ఏపీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. జగన్ను టార్గెట్ చేయకపోవడానికి ఇదే రీజన్ అనేది విశ్లేషకుల మాట కూడా.
తేలుకుట్టినట్లు…?
ఇక, ఢిల్లీలో చక్రం తిప్పే.. చాలా మంది నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారు కూడా జగన్పై ఫిర్యాదులు మోశారు. కానీ, ఇప్పటి వరకు ఏ విషయంలోనూ అమిత్ షా స్పందించలేదు. పైగా ఇదే శాఖ.. మూడు రాజధానులకు అనుకూలంగా వ్యవహరించడం.. ఏపీ బీజేపీ నేతల వైఖరిని స్పష్టం చేస్తోందని అంటున్నారు. కొన్నాళ్ల కిందట.. సోము వీర్రాజు స్పందిస్తూ.. ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని మేం కేంద్రానికి ప్రతిపాదన పంపాం! అన్నారు. మరి ఇదే నిజమైతే.. జగన్ చెబుతున్న మూడు రాజధానులకు కేంద్రంలోని హోం శాఖ ఎందుకు ? అనుకూలంగా వ్యవహరించిందనేది ప్రశ్న. దీనికి ఏపీ బీజేపీ నేతలు తేలు కుట్టినట్టు వ్యవహరిస్తున్నారు.
గ్రూపులుగా విడిపోయి…?
పైగా.. ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని అనుకున్నా.. కీలక విషయాల్లో వారు విఫలమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఏపీలో బీజేపీ నేతల మధ్య సఖ్యత లేదని.. ఒకరిపై ఒకరు అంతర్గత రాజకీయం చేసుకుంటున్నారనేది విమర్శ. ఇదే అమిత్ షా వంటి కీలక నేతలకు నచ్చడం లేదని చెబుతున్నారు. అందుకే ఏపీ బీజేపీ నేతలు ఏం చెబుతున్నా.. ఆయన పట్టించుకోవడం లేదని.. అంటున్నారు.ఇక, ప్రధాని మోడీ అయితే.. ఏపీలో బీజేపీ నేతలను అసలు పట్టించుకోవడం లేదనేది అందరికీ తెలిసిందే. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత సీఎం జగన్కు కలిసి వస్తోందని అంటున్నారు. మరి ఇప్పటకైనా.. ఏపీ బీజేపీ నేతలు.. సఖ్యతగా వ్యవహరిస్తేనే.. పార్టీ పుంజుకుంటుందని అంటున్నారు పరిశీలకులు.