అగ్రిమెంట్ కుదిరినట్లుందిగా
రాజకీయాలు అంటేనే అధికార పార్టీ అభ్యర్థులపై ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షం పై అధికార పార్టీ నాయకులు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం. ఇంకా కొంచెం [more]
రాజకీయాలు అంటేనే అధికార పార్టీ అభ్యర్థులపై ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షం పై అధికార పార్టీ నాయకులు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం. ఇంకా కొంచెం [more]
రాజకీయాలు అంటేనే అధికార పార్టీ అభ్యర్థులపై ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షం పై అధికార పార్టీ నాయకులు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే.. ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకోవడం. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పోయి.. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఒకపార్టీ నేతలపై మరో పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే, దీనికి భిన్నమైన వాతావరణం.. రాజధాని జిల్లా గుంటూరులోని ఒకే ఒక నియోజకవర్గంలో కనిపిస్తోంది. అక్కడ అంతా సైలెంట్.
ఆరోసారి ఓటమి పాలయి….
అధికార పక్షం తరఫున గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్షం సభ్యులను పన్నెత్తు మాట అనరు. నియోజకవర్గం సమస్యలను ఎత్తి చూపుతూ.. వారిని ఒక్క మాటంటే ఒక్కమాట కూడా విమర్శించరు. ఇక, ప్రతిపక్షంలో కూర్చున్న నాయకుడు కూడా గెలిచిన నేతపై ఎలాంటి కామెంట్లు చేయరు. అదే పొన్నూరు నియోజకవ ర్గం. ఇక్కడ నుంచి గడచిన ఐదు ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విజయం సాధించారు. ఎదురులేని విధంగా ఆయన ప్రభంజనం సాగింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరారు. అయితే, దీనికి భిన్నంగా ఇక్కడ వైసీపీ పాగా వేసింది.
చివరి నిమిషంలో దిగి….
గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉండి ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణలో భాగంగా పొన్నూరు కు బదిలీ అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు. కేవలం 1000 ఓట్ల తేడాతో నరేంద్రను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. దీంతో ధూళిపాళ్ల నరేంద్ర ఓడిపోయారు. అయితే, వీరి మధ్య సహజంగానే రాజకీయ వైరం కొనసాగుతుందని, ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటారని అందరూ అనుకున్నారు. ఏపీలోనే కాదు.. గుంటూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిన టీడీపీ మాజీల మధ్య ప్రతి రోజు యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
అంతా గప్ చుప్…..
కానీ, చిత్రంగా ఇక్కడ అంతా గప్‌చుప్! అనే తరహాలో వ్యవహారం సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే రోశయ్య టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌లు పరస్పరం అవగాహన కు వచ్చారని, ఒకరి జోలికి మరొకరు పోకుండా ఒప్పందాలు చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో భారీ ఎత్తున టీడీపీ ఉద్యమించినా.. ఇక్కడ పొన్నూరులో మాత్ర సైలెంట్. రాష్ట్రంలో ఎమ్మెల్యే లు, ఎంపీలు ఒకరిపై ఒకరు తిట్టి పోసుకుంటున్నా.. ఇక్కడ మాత్రం మౌనం. దీని వెనుక ఈ ఇద్దరూ ఒక అగ్రిమెంట్‌కు వచ్చారని అంటున్నారు. ధూళిపాళ్ల నరేంద్రకు సంగం డెయిరీ ఉంది. ఇది భారీ వ్యాపారం దీంతో ఎమ్మెల్యే కిలారుతో ఓ ఒప్పందానికి వచ్చి.. దీని జోలికి రాకుండా చేసుకున్నారట.
ఒకరి ఊసు మరొకరు….
అంటు సంగం లొసుగులను రోశయ్య ఎప్పుడూ ప్రస్తావించరట. అదే సమయంలో నీ జోలికి నేను కూడా రానంటూ.. దూళిపాళ్ల నరేంద్ర కూడా కిలారుకు హామీ ఇచ్చారని మరో టాక్? దీనికితోడు నరేంద్ర తమ్ముడు సురేంద్ర కూడా ఒప్పందానికి వచ్చాడని అంటున్నారు. దూళిపాళ్ల నరేంద్ర అధికారంలో ఉన్నప్పుడు అంతా తానై నడిపిన సురేంద్ర ఇప్పుడు ఇక్కడ వైసీపీకి బాగా కో ఆపరేట్ చేస్తున్నాడట. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. పార్టీ శ్రేణులు కూడా ఈ ఇద్దరికీ సహకరిస్తున్నాయి. వాస్తవానికి దూళిపాళ్ల నరేంద్ర అధికారంలో ఉన్న సమయంలోనూ పార్టీలో యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు కూడా తన వ్యాపారాల కోసమే అన్నట్టుగా రాజకీయాలు చేస్తుండడం గమనార్హం. అప్పుడంటే చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదనో ఏదో ఒకటి అలిగిన దూళిపాళ్ల నరేంద్ర ఇప్పుడు కూడా ఇలా మిలిఖాత్ పాలిటిక్స్ నడుపుతుండడమే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్.