Revnath reddy : ఇక్కడ మాత్రం సొంత స్ట్రాటజీతోనే
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తొలి ఎన్నికలను ఎదుర్కొనబోతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోతూనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన [more]
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తొలి ఎన్నికలను ఎదుర్కొనబోతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోతూనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన [more]
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తొలి ఎన్నికలను ఎదుర్కొనబోతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోతూనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న ఆరో ఉప ఎన్నిక ఇది. ఈ ఐదు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించలేదు. 2014 నుంచి నారాయణ్ ఖేడ్, పాలేరు, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక ఎన్నికలు జరిగాయి. దుబ్బాక మినహా అన్ని చోట్ల టీఆర్ఎస్ గెలిచింది.
అన్ని ఉప ఎన్నికల్లో….
కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాలను కూడా కోల్పోయింది. నారాయణఖేడ్, పాలేరు, హుజూర్ నగర్ లో సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. కాంగ్రెస్ లో అనైక్యత, నాయకత్వ లోపం కారణంగానే కాంగ్రెస్ ఓటమి పాలయింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సీనియర్ నేత జానారెడ్డి ఓటమి ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. అప్పటి వరకూ పీసీీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి నుంచి దిగిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చింది.
పీసీసీ చీఫ్ గా….
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పదవి చేపట్టిన తర్వాత కొంత కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. అయితే రేవంత్ కు పేరు రావడం ఇష్టం లేని కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే మోకాలడ్డుతున్నారు. రేవంత్ పై ఇప్పటికే అధిష్టానానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికల్లో లీస్ట్ మెజారిటీ రావాలని కోరుకునే నేతలు ఎందరో ఉన్నారు.
కనీస ఓట్లు సాధించాలని….
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోయినా యాభై వేల ఓట్ల వరకూ వస్తేనే రేవంత్ రెడ్డి ఇమేజ్ నిలబడుతుంది. లేకుంటే ఇక కాంగ్రెస్ నేతలు ఒంటికాలిపై లేస్తారని చెప్పకతప్పదు. రేవంత్ రెడ్డి అందుకే తన సామాజికవర్గం ఓటర్లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. స్టార్ క్యాంపెయినర్లుగా అనేక మంది పేర్లు ఉన్నా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సొంత వ్యూహాలను అమలుపరుస్తున్నారు.