Kararnam balaram : కరణం కన్ను మళ్లీ అక్కడ పడిందా?
తమకు పట్టున్న ప్రాంతం నుంచి తప్పుకోవడానికి ఏ రాజకీయ నేత కూడా అంగీకరించరు. కొంత పాజిటివ్ రిజల్ట్ వస్తే అక్కడ కుదురుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రకాశం జిల్లా నేత [more]
తమకు పట్టున్న ప్రాంతం నుంచి తప్పుకోవడానికి ఏ రాజకీయ నేత కూడా అంగీకరించరు. కొంత పాజిటివ్ రిజల్ట్ వస్తే అక్కడ కుదురుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రకాశం జిల్లా నేత [more]
తమకు పట్టున్న ప్రాంతం నుంచి తప్పుకోవడానికి ఏ రాజకీయ నేత కూడా అంగీకరించరు. కొంత పాజిటివ్ రిజల్ట్ వస్తే అక్కడ కుదురుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రకాశం జిల్లా నేత కరణం బలరాం కూడా ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నారు. పరిషత్ ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించడంతో చిరకాల ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ ను ఢీకొట్టాలన్న ప్రయత్నంలో కరణం బలరాం ఉన్నారు.
పరిషత్ ఎన్నికల్లో….
ఇటీవల వెల్లడయిన పరిషత్ కౌంటింగ్ లో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ పై చేయి సాధించింది. మొత్తం 73 ఎంపీటీసీలు ఉండగా, ఒక చోట ఎన్నిక నిలిచింది. 72 కు గాను వైసీపీ 62 స్థానాల్లోనూ, టీడీపీ ఎనిమిది స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో గెలిచారు. నిజానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించినా ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ వర్గీయులు పోటీ చేశారు. అయినా ఇక్కడ వైసీపీ గెలవడంతో కరణం బలరాం వర్గీయుల్లో ఆశ మొదలయింది.
అద్దంకి పై పట్టుకోసం….
తొలి నుంచి అద్దంకి పై పట్టు నిలుపుకునేందుకు కరణం బలరాం ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికలలో ఆయన టీడీపీ తరుపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం వైసీపీలో చేరిపోయారు. తన కుమారుడు కరణం వెంకటేష్ రాజకీయ భవిష్యత్ కోసం అద్దంకి నే ఎంచుకోవాలన్న పట్టుదలతో కరణం బలరాం ఉన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని ఆయన పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నారు.
గొట్టిపాటిని మట్టికరిపించాలని….
సుదీర్ఘకాలంగా కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య విభేదాలున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. ఇద్దరూ ఒక పార్టీలో ఎప్పుడూ ఉండరు. 2014 ఎన్నికల్లో గొట్టి పాటి రవికుమార్ వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గుర్తు మీద గెలిచిన కరణం బలరాం వైసీపీలోకి వచ్చారు. ఈసారి కూడా టీడీపీ నుంచి గొట్టిపాటి పోటీ చేయనుండటంతో కరణం తన కుమారుడిని వైసీపీ తరుపున అద్దంకి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.