టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
Chandrababu : బేగంపేట్ కు చేరుకున్న బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దయెత్తున స్వాగతం పలికారు.
DK Aruna : డీకే కూడా తప్పుకున్నారే... ఇప్పటికయితే మాత్రం ఈ నిర్ణయమే
భారతీయ జనతా పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. ఉన్న నేతలు కూడా పార్టీని వీడి వెళుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో చేరికల మాట అటుంచి పార్టీలో కీలకంగా ఉన్న నేతలే అర్ధాంతరంగా రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు.
KCR : సన్నాసులు సవాళ్లు విసురుతున్నారు.. అసెంబ్లీకి పంపేది ప్రజలా? వాళ్లా?
అసెంబ్లీ గడప తొక్కనివ్వమని కొందరు సన్నాసులు సవాళ్లు విసురుతున్నారని, అసెంబ్లీకి పంపేది ప్రజలు అహంకారం ఉన్న నేతలా? అని కేసీఆర్ ప్రశ్నించారు. గిరిజనులకు పెద్దయెత్తున పోడు భూములు ఇచ్చామని తెలిపారు.
భయంతో వెనక్కి వెళ్తున్నాము.. గుంటూరు కారం నిర్మాత..
అతడు, ఖలేజా సినిమాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూడో చిత్రం 'గుంటూరు కారం'. గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సక్సెస్ కాకపోయినా ఆడియన్స్ లో మంచి ప్రజాధారణ పొందాయి. ప్రస్తుతం మహేష్ అండ్ త్రివిక్రమ్ కూడా మంచి ఫార్మ్ లో ఉండడం, గత రెండు సినిమాలు మాదిరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంలా కాకుండా మాస్ మసాలా చిత్రంగా గుంటూరు కారం తెరకెక్కుతుండడంతో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
రాజశ్యామల యాగంలో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ లో ఆయన ఈ యాగంలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగం మూడు రోజుల పాటు జరగనుంది.
Communists : పొత్తుల కోసం వెంపర్లాడుతూ.. ప్రజాసమస్యలు పట్టించుకోక... ఈగతి
కామ్రేడ్లకు కాలం కలసి రావడం లేదు. ఎవరూ కలుపుకుని పోవడం లేదు. అసలు వారికి ఉన్న బలంపై ఇతర పార్టీలకే నమ్మకం లేదు. అందుకే కమ్యునిస్టు పార్టీలను అన్ని పార్టీలూ పక్కన పెడుతున్నాయి. గత దశాబ్దకాలంగా కమ్యునిస్టు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నాయి.
Janasena, Bjp : ఇంతకీ ఆ కలయిక తర్వాత జరిగిందిదేనా?
తెలంగాణ ఎన్నికలలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారయింది. అయితే ఇప్పటి వరకూ సీట్ల పంపకాలు మాత్రం జరగలేదు. జనసేనాని మాత్రం తన సోదరుడి కుమారుడు వరుణ్ పెళ్లి కోసం ఇటలీకి బయలుదేరి వెళ్లారు.
KTR : కేటీఆర్ వాహనం తనిఖీ
తెలంగాణ మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అమలుపర్చడంలో భాగంగా పోలీసులు ఆయన వాహనాన్ని తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళుతుండగా మధ్యలో తూప్రాన్ వద్ద పోలీసులు కేటీఆర్ వాహనాన్ని ఆపి తనిఖీలు జరిపారు.
వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోలు.. బాధతో పవన్ ఫ్యాన్స్ కామెంట్స్..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగబోతున్న ఈ పెళ్లి వేడుక సంగీత్ పార్టీ, హల్దీ, మెహందీ కార్యక్రమాలతో సందడిగా సాగనుంది.
AP Formation Day Special Story: శాపగ్రస్త ఆంధ్రప్రదేశ్..!
సుదీర్ఘ సముద్ర తీరం.. ప్రతీ నూట యాభై కిలోమీటర్లకు ఓ నగరం.. కష్టపడి పని చేసే జనం.. సమర్థమైన మానవ వనరుల సముదాయం.. ఇవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలు. కానీ ప్రాంతీయ, కుల, కక్షాపూరిత రాజకీయాల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర... అభివృద్ధిని ఫణంగా పెడుతోంది,ఇతర రాష్ట్రాల దృష్టిలో పలుచన అయిపోతోంది.