Sun Nov 17 2024 15:28:26 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
వైఎస్ షర్మిలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్,లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఈడీ అధికారి, సాగర్ డ్యామ్ వద్ద టెన్షన్ వాతావరణం..
సాగర్ డ్యామ్ వద్ద టెన్షన్ వాతావరణం.. భారీగా పోలీసులు
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్యామ్‌కు ఇరవువైపులా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. సాగర్‌కు ఉన్న మొత్తం 26 గేట్లలో 13వ నంబర్ గేట్ వద్ద ఏపీ పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం 13వ గేటు వరకూ తమ పరిధిలో ఉంటుందని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాము 13వ గేటు వద్ద కంచెను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.Animal Movie Review : రణబీర్ కపూర్ యానిమల్ మూవీ రివ్యూ ఏంటి..?
అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. అదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు తన రెండో చిత్రంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి 'యానిమల్' తెరకెక్కించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు.Pawan Kalyan : వైఎస్ షర్మిలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్... ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాను తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీతో పొత్తును తాను వ్యూహం ప్రకారమే కుదుర్చుకున్నానని తెలిపారు. ఎవరూ అసంతృప్తికి గురి కావద్దన్నారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పడితేనే శాంతి - సుస్థిరత ఏర్పడుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. 2024 తర్వాత దేశంలోనే అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే బాధ్యత అందరం తీసుకుందామని చెప్పారు.KTR: చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను: కేటీఆర్ ట్వీట్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం ఎదురు చూడడమే. డిసెంబర్ 3న తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్‌కే మొగ్గు చూపాయి. అసలు ఫలితాలు రావాలంటే 3వ తేదీ వరకు ఆగాల్సిందే.తెలంగాణ ఎన్నికలు ముగిసినా ఇంకా ఫలితాలు వెలువడకపోవడంతో ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. ప్రధానంగా అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ దాదాపుగా టిక్కెట్లు ఇచ్చింది. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. ఆర్థికంగా, సామాజికంగా బలమున్న వారే. అందుకే పెద్దగా ఆలోచించలేదు గులాబీ బాస్.
దేశంలోని వినియోగదారులకు షాకిచ్చాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ. 21 పెంచుతున్నట్లు ఆయిల్ గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి. ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు ఈ రోజు నుంచి అనగా డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నాయి.
చెన్నైలో లంచంగా తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. ఒక ఈడీ అధికారి లంచం తీసుకోవడం దొరికి పోవడం సంచలనంగా మారింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళనాడులోని ఒక వ్యాపారి నుంచి ఇరవై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఈడీ అధికారి అంకిత్ తివారి దొరికిపోయాడు.
తిరుపతిలో మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు.. రూ.కోటి విలువైన ఫోన్లు రికవరీ
ఈ రోజుల్లో చాలా మంది ఫోన్‌ను పోతుంటాయి. పోగొట్టుకున్న ఫోన్ మళ్లి దొరుకుతుందన్న గ్యారంటి ఉండదు. ఫోన్ పోయిందంటే చాలు ఇక ఆశలు వదులుకోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా అది దొరికే నమ్మకం ఉండదు. అలాంఇ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయంతో పోగొట్టుకున్నవారి ఫోన్లు తిరిగి వారి చేతికి వచ్చేస్తున్నాయి.తెలంగాణలో తాము మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యట్రిక్ కొట్టడం ఖాయమని, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని గులాబీ బాస్ భరోసా ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ప్రగతి భవన్లో దాదాపు 25 మంది మంత్రులను కేసీఆర్ కలిశారట.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీగా ఆయన ఉండవల్లికి చేరుకుంటున్నారు. దారి పొడవునా అభిమానులు పూలవర్షం కురిపించారు. జై బాబు నినాదాలతో మారుమోగిపోయింది.
Next Story