Mon Nov 18 2024 00:42:00 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
పురంద్రీశ్వరికి ఆ పనేమిటి : అంబటి
చంద్రబాబు చట్టంలో ఉన్న లొసుగులను వెతుకుతున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 17ఎను అడ్డంపెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే దొంగ చంద్రబాబు అని ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కేటీఆర్ పై అనుమానం అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కనిపించకపోవడంపై.. తనకు కేటీఆర్ పై అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో వివరాలను వెల్లడించాలని, ఆయనను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ జారీ చేసిన నోటీసులపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. సీఐడీ విచారణపై తన ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ కోరారు. అయితే దీనిపై బుధవారం విచారిస్తామని కోర్టు తెలిపింది.
అనారోగ్యం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు దూరమైన భారత జట్టు ఓపెనర్ శుభమాన్ గిల్.. ఆసుపత్రిలో ఉన్నాడనే వార్త అభిమానులను షాక్ కు గురిచేసింది. చెన్నై లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. బుధవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు ముందు శుభమాన్ గిల్ అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో చేరాడు.
Breaking : చంద్రబాబు క్వాష్ పిటీషన్ వాయిదా
సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. వచ్చే శుక్రవారానికి విచారణను వాయిదా వేసింది. గత మూడు రోజుల నుంచి చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇజ్రాయిల్‌కు పెరుగుతున్న మద్దతు
ఇజ్రాయిల్ - పాలస్తీనా ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే మూడు రోజుల నుంచి జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది అశువులు బాశారు. అయితే ఇజ్రాయిల్ కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతుంది. హమాస్ ఉగ్రవాదుల దాడిని అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.హైదరాబాద్.. మరో బెజవాడగా మారిందా?
ఇది మే నెలా? అక్టోబర్ మాసమా? చాలా మందికి కలుగుతున్న సందేహం. అక్టోబరులోకి వచ్చిన ఎండలు తగ్గుముఖం పట్టలేదు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఉక్కపోతతో ఊపిరితీస్తుంది. సీజన్ అంటే ఎలా ఉండాలి? జూన్, జులై వరకూ ఎండలు మండి పోవడం సహజమే. తర్వాత క్రమేపీ వర్షాలు మొదలయి అనంతరం చలి ప్రారంభమవుతుంది.ఆర్టీసీ డ్రైవర్‌కు 47 బంగారు పతకాలు.. జాతీయ, విదేశీ స్థాయిలో..
ఓ ఆర్టీసీ డ్రైవర్ ఒకవైపు ఉద్యోగంతో పాటు మరోవైపు తనకిష్టమైన బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్‌లో 47 పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఉద్యోగం చేస్తున్నా ఏదో సాధించాలనే తపనతో తన పట్టుదల ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా చేసింది. ఆ ఆర్టీసీ డ్రైవర్ కాకినాడకు చెందిన మందపల్లి శ్రీనివాస్.ఢిల్లీలో ఐటీ శాఖ దాడులు.. మళ్లీ ఆప్ నేత టార్గెట్
ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఢిల్లీలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా ఆయన ఉన్న సమయంలో చేపట్టిన నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.ఆసుపత్రిలో గిల్.. అప్పటివరకూ కష్టమే..!
2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తొలి మ్యాచ్‌లో గెలిచింది. కానీ భారత జట్టు సమస్యలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. భారత్ టాప్ ఆర్డర్ ముఖ్యమైన సందర్భాల్లో విఫలమవుతుండగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది. అదే సమయంలో జట్టు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇంకా మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా లేడు.జగనూ... జనం అలా చెబితే నమ్ముతారా
చంద్రబాబు అరెస్ట్‌తో తనకు ఏమాత్రం సంబంధం లేదని, తాను లండన్‌లో ఉండగా చంద్రబాబును అరెస్ట్ చేశారని వైఎస్ జగన్ నిన్న జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో చెప్పారు. తనకు సంబంధం లేకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఆయన చెప్పుకుంటూ వెళ్లారు.Next Story