టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
పవన్ కంటే బర్రెలక్క బెటర్: అంబటి, గూగుల్ ప్లేస్టోర్‌లో 17 మోసపూరిత లోన్ యాప్స్..మహిళలకు టిక్కెట్లు కొట్టిన కండక్టర్... వెంటనే సస్పెన్షన్
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Ram Charan : ఇంటర్నేషనల్ అవార్డుని గెలుచుకున్న రామ్ చరణ్..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆ మధ్య ప్రముఖ అంతర్జాతీయ అవార్డుల వేడుకలో ప్రెజెంటర్ గా వెళ్లి అరుదైన గౌరవం అందుకున్నారు. తాజాగా అమెరికాలో నిర్వహించే పాప్ ప్రతిష్టాత్మకమైన పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా అవార్డుని సొంతం చేసుకున్నారు.
బాలీవుడ్ అగ్రనటులకు కేంద్రం షోకాజ్ నోటీసులు.. కారణం ఏంటంటే
గుట్కాకు సంబంధించి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ముగ్గురు బాలీవుడ్ నటులకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోకాజ్ నోటీసులు అందుకున్న ముగ్గురు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లు ఉన్నారని అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.
భయం భయంగా అధికారులు.. ఏం చేస్తారో బితుకుబితుకుమంటూ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్ డైరీ ఓపెన్ చేశారని చెబుతున్నారు. ఇప్పుడు అధికారులు బిక్కుబిక్కుమంటూ విధి నిర్వహణ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొందరు అధికారులు తమ పోస్టులకు ఎసరు తప్పదని ముందుగానే అంచనా వేసుకుంటున్నారు.
మహిళలకు టిక్కెట్లు కొట్టిన కండక్టర్... వెంటనే సస్పెన్షన్
రాష్ట్రంలో నిన్నటి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆర్టీసీ సిబ్బంది మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు.
44 చోట్ల ఎన్ఐఏ ఆకస్మిక దాడులు..15 మంది అరెస్ట్
దేశంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కుట్రలను భగ్నం చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా NIA-జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం తెల్లవారు జామున మహారాష్ట్ర, కర్ణాటకల్లోని 44 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో ఐసిస్ మాడ్యూల్ నాయకుడితో సహా మొత్తం 15 మందిని అరెస్టు చేశారు.
సర్పంచ్ నుంచి సీఎం వరకూ... ప్రస్థానం అదిరిపోలా
ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ను శాసనసభ పక్షం ఎన్నుకుంది. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు. బీజేపీ అధిష్టానం సూచన మేరకు విష్ణుదేవ్ సాయ్ ను శాసనసభ్యులుగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ కు అంత సులువుగా ముఖ్యమంత్రి పదవి దక్కలేదు.
మాయావతి వల్ల కానిది...ఆకాశ్ ఆనంద్ వల్ల సాధ్యమవుతుందా?
ప్రాంతీయ పార్టీలకు వారసులు వచ్చేస్తారు. జాతీయ పార్టీలది వేరు. ప్రాంతీయ పార్టీలుగా ప్రారంభమై జాతీయ పార్టీలుగా మారినప్పటికీ వారి కుటుంబాల నుంచే వారసులు వస్తుంటారు. ఎవరూ దీనికి అతీతులు కారు. తమ కుటుంబ సభ్యులకే పార్టీ పగ్గాలు అప్పగించడం ఆనవాయితీగా వస్తుంది.
గూగుల్ ప్లేస్టోర్‌లో 17 మోసపూరిత లోన్ యాప్స్.. ప్లేస్టోర్ నుంచి డిలీట్
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. మొబైల్లో రకరకాల యాప్స్ వేస్తుంటాము. అయితే వేసే ముందు అవి ఎలాంటి యాప్స్ అనేవి గమనించము. కొన్ని మోసపూరితమైనవి కూడా ఉంటాయి. దీని వల్ల ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ప్లే స్టోర్‌లో వివిధ లోన్ యాప్స్ కూడా కనిపిస్తుంటాయి.
ఐటీ దాడులకు ముందు అధికారులు ఎలా సిద్ధమవుతారు? తప్పుడు కేసు పెట్టవచ్చా?
దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ కుమార్ సాహుకు చెందిన స్థలాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు . దాదాపు రూ.300 కోట్ల వరకు పట్టుకున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఏ ఏజెన్సీకి ఒకే ఆపరేషన్‌లో ఇంత మొత్తంలో నగదు రావడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు అధికారులు.
పవన్ కంటే బర్రెలక్క బెటర్: అంబటి
తుఫానుపై ప్రభుత్వం ముందస్తు చర్యలతో పెద్ద ముప్పు తప్పిందని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి సంక్షోభాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు లాంటి షో వర్క్‌లు చేయడం జగన్ కు చేతకాదన్నారు.