Thu Dec 19 2024 13:50:33 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
గూగుల్ ఇండియా సెర్చ్‌లో 'కియారా' టాప్.. ఆమె భర్త ఏమో...రాజీనామాను ఆమోదించని గవర్నర్, దేవుడి ప్రచారం రథంలో గంజాయి రవాణా.. పోలీసులు పసిగట్టడంతో?
ప్రపంచంలోనే మొట్టమొదటి AI ల్యాప్‌టాప్ వచ్చేస్తోంది!
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అద్భుతమైన ల్యాప్‌టాప్‌ను పరిచయం చేయనుంది. శాంసంగ్ ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనుంది. గెలాక్సీ బుక్ 4 పేరుతో ఈ ల్యాప్‌టాప్ త్వరలో మార్కెట్లోకి రానుందని నివేదిక చెబుతోంది.టాలీవుడ్ లెక్కలు తెలుస్తా.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి..
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. కొత్త మంత్రులు పదవులు చేపడుతున్నారు. ఆయా శాఖల పై కొత్త మంత్రులు దృష్టి సారిస్తున్నారు. ఇక కొత్తగా పదవి చేపట్టిన మంత్రులకు, నాయకులకు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క నాయకుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్ వంటి స్టార్స్ ట్వీట్స్ ద్వారా తెలియజేశారు.రేవంత్ రెడ్డి కొత్త సెక్రటరీ ఎవరో తెలుసా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం షానవాజ్ ఖాసిం హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్నారు. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబద్ సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు నియమితులయ్యారు. హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్స్ వింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు.కొత్వాల్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
రేవంత్ రెడ్డి పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఆయనకు బాధ్యతలను నియమించారు. కొత్తకోట శ్రీనివాస రెడ్డి కొంతకాలంగా లూప్ లైన్ లో నియమిచంారు. రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించారు.సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని ఉన్నాయంటే?
2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. సాధారణ పరిపాలన విభాగం జారీ చేసిన నోటిఫికేషన్లో, 2024 ఫిబ్రవరిలో రెండవ శనివారం మినహా అన్ని నెలల్లో అన్ని ఆదివారాలు, రెండవ శనివారాలు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని కార్యాలయాలు మూసివేయనున్నారు.రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్
రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. ఇటీవల ముగిసిన ఎన్నికలలో సంగనేర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్‌కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్‌పై 1,45,000 ఓట్లతో విజయం సాధించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ పేరును బిజెపికి చెందిన వసుంధర రాజే ప్రకటించారు.దేవుడి ప్రచారం రథంలో గంజాయి రవాణా.. పోలీసులు పసిగట్టడంతో?
గంజాయి రవాణాలో కొత్త మార్గాలను స్మగ్లర్లను ఎంచుకుంటున్నారు. పోలీసులు కళ్లుగప్పి గంజాయి తరలించడానికి కొత్త కొత్త రూట్లను అవలంబిస్తున్నారు. అయితే ఎంత దాచుకుని గంజాయి తరలిస్తున్నా పోలీసుల డేగ కన్ను నుంచి తప్పించుకోలేక పోతున్నారు. వేల కిలోల కొద్దీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నా ప్రతి రోజూ స్మగర్లు వాటి తరలింపునకు ఏమాత్రం వెనుకాడటం లేదు.Chiranjeevi : చిరంజీవి వివరణ కోరిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి..
Chiranjeevi : ఇటీవల తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ త్రిష పై చేసిన కామెంట్స్ ని చిరంజీవి ఖండిస్తూ ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవితో పాటు మాళవిక మోహనన్, చిన్మయి, కుష్బూ, లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, నితిన్ కూడా త్రిషకి సపోర్ట్ గా నిలుస్తూ మన్సూర్ పై అసహనం వ్యక్తం చేశారు.Breaking : రాజీనామాను ఆమోదించని గవర్నర్
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆమోదించలేదు. ప్రభుత్వం మారడంతో ఆయన నిన్న రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు పంపారు. అయితే గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జనార్థన్ రెడ్డి రాజీనామాను ఆమోదించలేదు.2023 Rewind : గూగుల్ ఇండియా సెర్చ్‌లో 'కియారా' టాప్.. ఆమె భర్త ఏమో..
2023 Rewind : 2023 పూర్తి కావొస్తుంది. ఈ ఏడాది చంద్రయాన్ 3 లాంచ్, వరల్డ్ కప్, ఆస్కార్, సెలబ్రిటీస్ పెళ్లిళ్లు ఇలా చాలా అరుదైన ఈవెంట్సే జరిగాయి. దీంతో ఈ ఇయర్ గూగుల్ లో ఈ విషయాలు గురించి నెటిజెన్స్ సెర్చ్ చేస్తూ వచ్చారు. ఈక్రమంలోనే నెటిజెన్స్ గూగుల్ లో ఎక్కువుగా సెర్చ్ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి.Next Story