టాప్ 10 తెలుగు లేటెస్ట్ న్యూస్ 12-9-23
latest top 10 telugu news 12-9-23
తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఆధారపడి ఉందన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తర్వాతే తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే క్లారిటీ వస్తుందని అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
సీతారామం దుల్కర్ సల్మాన్ కుటుంబంలో విషాదం
సీతారామంతో తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టిన దుల్కర్ సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దుల్కర్ తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరో అనే సంగతి తెలిసిందే..! ఆయన సోదరి చనిపోయారు. మమ్ముట్టి సోదరి అమీనా కన్నుమూశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
హౌస్ కస్టడీ పిటీషన్ తిరస్కరణ
చంద్రబాబుకు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలింది. చంద్రబాబు తరుపున న్యాయవాదులు వేసిన హౌస్ కస్టడీ పిటీషన్ ను న్యాయసథానం కొట్టివేసింది. న్యాయస్థానం హౌస్ కస్టడీ పిటీషన్ న్యాయస్థానం కొట్టివేయడం టీడీపీ నేతలను నిరాశపర్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆల్ ఈజ్ వెల్.. బట్?
క్యాడర్ పుష్కలం. ఓటు బ్యాంకు కూడా అధికం.కానీ గత రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టలేకపోయింది. ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని అనుకున్న సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఈసారైనా పట్టు నిలుపుకోగలుగుతుందా? లేదా ఎప్పటిలాగే చతికలపడుతుందా? అన్నదే ప్రశ్న.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
విలాసవంతమైన రైల్లో రష్యాకు బయలుదేరిన 'కిమ్'
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ నేడు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆయుధ అంశాలపై చర్చల కోసమే ఆయన రష్యాకు వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆ కార్లు మరింత ప్రియం
డీజిల్ కార్ల ధరలు త్వరలో పెరిగే అవకాశాలున్నాయి. డీజిల్ కార్లతో కాలుష్యం పెరుగుతుందని భావించి పదిశాతం పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. పది శాతం పొల్యూషన్ ట్యాక్స్ ను డీజిల్ కార్ల పై కేంద్ర ప్రభుత్వం విధించనున్నట్లు తెలిసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
టాస్ గెలిచిన రోహిత్.. ఎవరిని పక్కన పెట్టారంటే?
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ మీద ఘన విజయం సాధించిన భారత్ నేడు శ్రీలంకతో తలపడనుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజున జరగగా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా భారత్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
చంద్రబాబును కలవనుంది వీరే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు, ఇతర నేతల రాకతో సెంట్రల్ జైలు వద్ద హడావిడి వాతావరణం ఏర్పడింది. సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ అధికారులు కలిశారు. సీఎం జగన్ ను సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
టీడీపీని కబ్జా' అంటూ వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాక పలువురు నాయకులు తమ తమ అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ కబ్జా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.