టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
OG షూటింగ్ ఆగిపోయింది.. నిర్మాత వైరల్ ట్వీట్..సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. సాధారణ సెలవులు ఎన్నంటే?ఢిల్లీ పార్లమెంటులో దాడిలో పాల్గొంది వీళ్లే
ఏపీకి మరో తుఫాను ముప్పు
బంగాళాఖాతం లో డిశంబర్ 16 వ తేదీన ఒక ఉపరితల అవర్తనం ఏర్పడనుంది. డిశంబర్ 18 కి అది అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం శ్రీలంక-తమిళనాడు -ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా ఏర్పడు తుందని కూడా హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీ పార్లమెంటులో దాడిలో పాల్గొంది వీళ్లే
పార్లమెంటులో దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. మొత్తం నలుగురు నిందితులు ఈ దాడిలో పాల్గొన్నారు. దాడి ఘటనతో విజిటర్స్ పాస్‌లను స్పీకర్ రద్దు చేశారు. తిరిగ యధాతధంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ఓం బిర్లా దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపి నిందితులకు తగిన శిక్ష విధించేలా చేస్తామని సభకు హామీ ఇచ్చారు.
తొందరపాటు వద్దంటున్న సీతక్క
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..! సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని.. ప్రభుత్వం ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామన్నారు.
సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. సాధారణ సెలవులు ఎన్నంటే?
2024 సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉండడంతో వచ్చే ఏడాదికి సంబంధించి సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు, 25 ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
Telangana Speaker : స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాదరావు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో రేపు సభలో గడ్డం ప్రసాదరావు స్పీకర్ గా ఎన్నికయినట్లు అధికారికంగా ప్రకటించనున్నారు.
Chandrababu : మూడు నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు నెలల తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయనకు పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ఈ ఏడాది సెప్టంబరు 9న అరెస్టయి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
KTR : ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం... ఇప్పుడుంది అసలు ఆట
సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలా నడుపుతారో చూస్తామని ఆయన అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.లెక్కలు వేసుకుని హామీలు ఇచ్చారా? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.
నవంబర్ 19 రాత్రి, 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ బాధను భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.అహ్మదాబాద్‌లో ఫైనల్ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ ఆరోజు ప్రెజెంటేషన్ వేడుకలో బాధతోనే ప్రసంగించాడు. బాధలో ఉన్న భారతజట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఇక ఆ తర్వాత భారత కెప్టెన్ ఎక్కడా మాట్లాడలేదు.
Pawan Kalyan : OG షూటింగ్ ఆగిపోయింది.. నిర్మాత వైరల్ ట్వీట్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ రాజకీయ వ్యవహారాలు వల్ల ఈ చిత్రాలు షూటింగ్ ఎప్పుడు పూర్తి అయ్యి, ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాయో అన్నది మాత్రం తెలియడం లేదు.
తిరువనంతపురంలో టెన్షన్.. శబరిమల ఎఫెక్ట్
తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమలలో సరైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. రోజుకు శబరిమలకు లక్ష మంది భక్తులు చేరుకుంటుండటం... సరైన సౌకర్యాలు కల్పించడం లేదని బీజేపీ ఆరోపిస్తుంది. కిలోమీటర్ల వాహనాలు నిలిచపోయాయి. బీజేపీ శ్రేణులపై వాటర్ క్యానన్లతో అడ్డుకుంటున్నారు.