Thu Dec 19 2024 19:12:59 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టీడీపీకి సీఐడీ నోటీసులు జారీ.. ఆ కోట్ల రూపాయలు ఎక్కడివి?
ఆంధ్రప్రదేశ్ సీఐడీ తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న టీడీపీ నేత అశోక్ బాబుకు ఈ నోటీసులు అందచేశారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కు సంబంధించిన కేసులో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి 27 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది.ఇలాంటి క్రేజ్ మొదటి సారి చూసాను: ఆ హీరోపై అమితాబ్ ప్రశంసలు
అమితాబ్ బచ్చన్ కి నచ్చిన దక్షిణాది నటుడు ఎవరో తెలుసా? ఇంకెవరు? ఈ ఏడాది జాతీయ అవార్డు గ్రహీత, పుష్పరాజ్ అల్లు అర్జున్. ఇటీవల జరిగిన కౌన్ బనేగా కరోడ్ పతి ఎపిసోడ్ లో బన్నీ పై బిగ్ బి ప్రశంసల వర్షం కురిపించాడు. 69 వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు ఎవర్ని వరించింది అని అమితాబ్ ఓ పోటీదారుని ప్రశ్నించారు.Telangana Elections : ఉపసంహరించుకోండి.. ప్లీజ్.. అధికారంలోకి రాగానే పదవి గ్యారంటీ
నామినేషన్ల ఉపసంహరణకు రేపు చివరి రోజు కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులను ఉపసంహరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ నామినేషన్ల ఉపసంహరణపై ఫోకస్ ను పెట్టాయి. రెబల్ అభ్యర్థులు ఉన్న చోట వారిని నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చివరి సారి ప్రయత్నం చేస్తున్నారు.Telangana Elections : కండువాలు కప్పేస్తే.. కాసేపు ఆనందం.. వారికి అంత సీన్ లేదట
ఎన్నికలంటే నేతలు పార్టీలు మారడం సహజం. తనకు టిక్కెట్ దక్కలేదనో.. మరేదో కారణం చూపి అధికార పార్టీ నుంచి విపక్ష పార్టీల వైపునకు.. అలాగే విపక్షాల నుంచి అధికార పార్టీ వైపు నేతలు జంప్ చేస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇది సహజంగా జరిగే పరిణామమే.Mrunal Thakur : మృణాల్తో డేటింగ్.. సింగర్ పోస్టు వైరల్..
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ప్రేమ, పెళ్లి రూమర్స్ రోజురోజుకి ఎక్కువ అయ్యిపోతున్నాయి. ఆమె ఎక్కడ కనిపించినా అక్కడ ఒక రూమర్ ని సృష్టిస్తూ వస్తున్నారు. మొన్నటి మృణాల్ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని వార్తలు రాగా, ఇప్పుడు బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్షాతో మృణాల్ డేటింగ్ లో ఉందని చెబుతూ వైరల్ చేస్తున్నారు.నేటి నుంచి టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశాలు
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన - టీడీపీ ఆత్మీయ సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఉమ్మడి కార్యక్రమాలపై చర్చించనున్నారు. నియోజకవర్గాల స్థాయిలో రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పోయి వచ్చే ఎన్నికల్లో పని చేయాలని భావిస్తూ నియోజకవర్గ స్థాయిలో ఈ ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు.Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.Devara : దేవర షూటింగ్ అప్డేట్.. మరో రెండు నెలలో..!
Devara : కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.Mahesh - Charan : మహేష్, చరణ్ ఇంత క్లోజ్ ఫ్రెండ్స్..? ఇవి గమనించారా..?
Mahesh Babu - Ram Charan : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా ఒకరితో ఒకరు ఎంతో స్నేహంగా ఉంటూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఇతర హీరోల సాన్నిహిత్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్.. ఇలా ప్రతి ఒక్కరు చరణ్ తో చాలా క్లోజ్ గా ఉంటూ కనిపిస్తారు.Telangana Elections : కార్తీక మాసం.. వనభోజనం.. కుల సమావేశం.. ఏర్పాట్లు షురూ
తెలంగాణ ఎన్నికల వేళ కార్తీక మాసం వచ్చేసింది. ఇక చూడండి.. కుల సమావేశాలకు నేతలు సిద్ధమవుతున్నారు. కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్లడం సంప్రదాయంగా వస్తుంది. సాధారణంగా స్నేహితులు, బంధువులు కలసి వనభోజనాలకు వెళ్లి వస్తుంటారు. కార్తీక మాసంలో అందరూ కలుసుకుని తమ కుటుంబ సమస్యలను చెప్పుకోవడానికి వీటిని వేదికలుగా ఉపయోగించుకుంటారు.Next Story