టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
చిట్ చాట్ లో సీఎం.. కీలక వ్యాఖ్యలు, జగన్ లెక్కలన్నీ తారుమారు అవుతున్నాయ్, రెక్కీ జరిపారు.. తర్వాతనే దాడికి.. తప్పించుకున్న వారి కోసం వేట
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
చిట్ చాట్ లో సీఎం.. కీలక వ్యాఖ్యలు
అధికారుల నియామకాల్లో పైరవీలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన మీడియా చిట్ చాట్ లో పలు విషయాలపై స్పందించారు. అలాగే కొత్త భవనాల నిర్మాణాలను కూడా చేపట్టబోమని తెలిపారు. గత ప్రభుత్వం పన్నెండు నుంచి పదమూడు గంటలు మాత్రమే విద్యుత్తు ఇచ్చిందని, తమ ప్రభుత్వం మాత్రం ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు ఇస్తుందని ఆయన తెలిపారు.
రెక్కీ జరిపారు.. తర్వాతనే దాడికి.. తప్పించుకున్న వారి కోసం వేట
పార్లమెంటులో నిన్న జరిగిన దాడిలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు ముందుగా రెక్కీ జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిన్న జరిగిన పార్లమెంటు దాడిలో మొత్తం ఆరుగురు పాల్గొనగా, నలుగురు నిందితులు పోలీసులకు చిక్కారు. మరో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. వారి కోసం వేట మొదలయింది.
జగన్ లెక్కలన్నీ తారుమారు అవుతున్నాయ్
గన్ లెక్కలు తారుమారయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.150 సీట్లు మార్చినా వైసీపీ గెలవలేదననారు. తమ పార్టీ అభ్యర్థులకు ప్రజామోదం ఉందని చెప్పారు. దళితులను బీసీలనే ఎక్కువగా ఇతర నియోజకవర్గాలకు పంపించారననారు.
టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారని..
వీళ్ల కోసం కోట్లు కుమ్మరించడానికి రెడీ.. వారు దొరికితే చాలు అంతేనట
ఐపీఎల్ 2024లో ఆటగాళ్ల వేలానికి సమయం దగ్గర పడింది. ఈ నెల 19వ తేదీన దుబాయ్ వేదికగా వేలం ప్రక్రియ మొదలు కానుంది. ఐపీఎల్ అంటేనే కాసుల పంట. కేవలం ఫ్రాంచైజెస్ కు మాత్రమే కాదు.. ప్రసార హక్కులు పొందే ఛానల్స్ కు, ఆటగాళ్లకు మాత్రం కోట్లు తెచ్చి పెడతాయి. ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకునే వీలున్న ఏకైక గేమ్ ఐపీఎల్ మాత్రమే.
యానిమల్ సినిమా, కలెక్షన్స్ పై దారుణ విమర్శలు
యానిమల్ సినిమా కలెక్షన్స్ దుమ్ముదులుపుతున్నాయి. 13 రోజుల్లో ఈ సినిమా 772.33 కోట్లు కలెక్ట్ చేసింది. A రేటెడ్ సినిమా.. మూడున్నర గంటల నిడివి ఉన్నా కూడా… కూడా ఈ సినిమా కలెక్షన్స్ భారీగా ఉన్నాయి. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పటికీ జోరుగా వసూళ్లను దక్కించుకుంటోంది. ఇండియాలోనే యానిమల్ సినిమా 9 రోజుల్లో రూ.395.27 కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది.
హైదరాబాద్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు... ఆరుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కరాచీ బేకరీలో సిలండర్ పేలిన ఘటన కలకలం సృష్టించింది. గాయపడిన వారిలో సిబ్బంది తో పాటు కొందరు కస్టమర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.
ఈ నెల 18న హైదరాబాద్ కు రాష్ట్రపతి రాక
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ లో ఉంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.
Sabarimala : దర్శన సమయాన్ని పొడిగించినా.. లాభం లేదే.. ఇంతటి క్యూలైనా?
శబరిమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు లక్ష మంది భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. వీరు అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే 24 గంటల సమయం పడుతుంది. మరో వైపు అనేక మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. దీంతో ట్రావెన్కోర్ దేవస్థానం దర్శన సమయాలను పొడిగించింది.
గూగుల్ సెర్చ్‌లో టాప్ 3 చిత్రాల్లో 'జవాన్', అగ్ర నటుల్లో కియారా అద్వానీ
ఇయర్ ఇన్ సెర్చ్ లిస్ట్ 2023 ముగియనుంది. ఈ సంవత్సరం లిస్ట్‌లో చాలా కొన్ని భారతీయ పేర్లు ఉన్నాయి. ఈ సంవత్సరంలో అత్యధికంగా సెర్చ్‌చేసిన టాప్ 10 సినిమాల్లో మూడు ప్రధాన సినిమాలు ఉండగా, 'జవాన్' టాప్ 3లో నిలిచింది. కియారా అద్వానీ ఈ సంవత్సరంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటీనటులలో ఒకరు.