Fri Dec 20 2024 08:44:26 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
మామూలుగా లేదుగా.. మరోసారి గెలుపు దిశగానే యత్నం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఆయన అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మ్యానిఫేస్టోను రూపొందించారు. రైతులు, యువత, మహిళల లక్ష్యంగా మ్యానిఫేస్టోను తయారు చేశారు. తెలంగాణలోని ప్రధాన వర్గాలను గులాబీ పార్టీ వైపు తిప్పేలా మ్యానిఫేస్టోలో ప్రతి అక్షరాన్ని ఆయన పదిల పర్చారు.ఫస్ట్ లిస్ట్ ప్రకటించగానే .. కాంగ్రెస్‌లో రగడ.. ఫ్లెక్సీలు చించి
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించింది. యాభై ఐదు మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అయితే కొన్ని చోట్ల అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ కు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంలో ఉన్న ఫొటోలను కార్యకర్తలు చించి వేశారు. తమ నిరసనను తెలియజేశారు.ఆరుసార్లు గెలిచినా పట్టించుకోని పార్టీ.. అందుకేనట
సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి టిక్కెట్ కేటాయించింది. నాగం జనార్థన్ రెడ్డి నాగర్ కర్నూలు నుంచి సుదీర్ఘంగా రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన మంత్రిగా దశాబ్దాల పాటు పనిచేశారు.మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన ఆ ముగ్గురు కంటెస్టెంట్స్..
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఆరో వారం పూర్తి చేసుకొని ఏడో వారంలోకి అడుగు పెడుతుంది. ఐదు వారలుగా హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్స్ బయటకి వెళ్తూ వచ్చారు. ఇక ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకి రాబోతున్నారు అనేది అందరిలో ఆసక్తి నెలకుంది. ఆడియన్స్ అంతా ఎలిమినేషన్ గురించి ఆలోచిస్తుంటే, బిగ్‌బాస్.నెలకు రూ.210తో రూ.5 వేల పెన్షన్.. పూర్తి వివరాలు
మోడీ సర్కార్ దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. రైతులు, మహిళలు, చిన్నవ్యాపారులు ఇలా రకరకాల పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు కూడా మోడీ సర్కార్ పెన్షన్ స్కీమ్‌ను అందిస్తోంది.హమాస్‌ను ఖతం చేసే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు - ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. గాజా లోకి ప్రవేశించాయి ఇజ్రాయెల్ యుద్ద ట్యాంకులు. హమాస్‌ను ఖతం చేసే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే గాజాలో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో మార్చురీలు నిండిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది.కాంగ్రెస్... తొలి జాబితా ఇదే.. 55 అభ్యర్థుల ఖరారు
తెలంగాణలో 55 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాను ప్రకటించడంతో ఇక తెలంగాణ రాజకీయాలు వేడెక్కినట్లే. ఎక్కడా వివాదాలు లేని చోట తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. సర్వేల ప్రకారమే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇలా ఉంది.అందరికీ వరాలు.. అన్నీ ఉచితంగానే... ఓటు కోసం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మ్యానిఫేస్టో ప్రకటించనున్నారు. 119 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందచేయనున్నారు. ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారానికి కూడా కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. హుస్నాబాద్ నుంచి ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. తొలుత మ్యానిఫేస్టోను ఆయన ప్రకటించనున్నారు.నిషేధం తొలగింపు.. యూటర్న్ తీసుకున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. గతంలో విధించిన నిషేధాన్ని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌ల దిగుమతిని భారత్ నిషేధించబోదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. అయితే ఈ ల్యాప్‌టాప్ దిగుమతుల నిషేధాన్ని ఈ ఏడాది ఆగస్టులో విధించింది. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో భారత్‌కు మేలు.. ఎలాగంటే..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. రానున్న రోజుల్లో ఈ వార్ మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం తీవ్రమైతే ఇజ్రాయెల్‌లోని ప్రపంచ కంపెనీలు అక్కడ తమ వ్యాపారాన్ని ముగించే అవకాశాలు ఉన్నాయని ఓ ఆంగ్ల దిన పత్రిక వెల్లడించింది.Next Story