Sun Nov 17 2024 18:31:17 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
వజ్రమయ్యా నువ్వు.. ఏమని వర్ణించమూ...?
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లి సెంచరీ చేశాడు. తన యాభైవ సెంచరీని ముంబయి వాంఖడే స్టేడియంలో పూర్తి చేసుకుని రికార్డును బ్రేక్ చేశాడు. మొన్న సచిన్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లి ఇప్పుడు దానిని దాటిపోయి తనకు సాటి లేదని నిరూపించుకున్నాడు.ఆ పెద్దాయన ఎన్నికలు ముందు టెంకాయ కొట్టి పోయాడంతే
వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని ఎన్నికలకు ముందు ప్రారంభించిన నేత చంద్రబాబు అని జగన్ అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా శంకుస్థాపనలు చేసి మోసం చేశారన్నారు. ప్రాజెక్టు ప్రారంభమవుతుందని రైతులను మోసం చేసింది చంద్రబాబు అని జగన్ అన్నారు. మాచర్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు.. ఫోటో వైరల్..
Allu Sirish - Manchu Lakshmi : అల్లు వారసుడు శిరీష్, మంచు వారసురాలు శిరీష్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం వారసులు గానే కాకుండా ఇద్దరు పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు.Chandrababu : పదమూడు రోజులే గడువు.. జైలుకు వెళతారా? బయటే ఉంటారా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో ఆయన మధ్యంతర బెయిల్ పై చికిత్స పొందుతున్నారు. ఈ నెల 28వ తేదీన తిరిగి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇంకా పదమూడు రోజులు మాత్రమే గడువు ఉంది.Andhra Pradesh : నేటి నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా అధికారులు కులగణన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఐదు ప్రాంతాల్లో నేడు కులగణన ప్రారంభం కానుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో కుల గణనను ప్రారంభించనున్నారు.Madhu Yashki : మధు యాష్కీ ఇంట్లో సోదాలు
ఎల్.బి.నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి ఇంట్లో సోదాలు నిర్వహించడానికి పోలీసులు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులతో మధు యాష్కి వాగ్వాదానికి దిగారు. ఎవరి అనుమతితో తన ఇంట్లో సోదాలు నిర్వహించడానికి వచ్చారని నిలదీశారు. అందుకు అవసరమైన అనుమతులను చూపించాలని కోరారు.Chandrababu : నేడు బెయిల్ పై విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.నేడు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
నేడు నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిని విరమించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు మొత్తం పదమూడు చోట్ల రెబల్స్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ పదమూడు నియోజకవర్గాల్లో ప్రధాన నేతలే ఎన్నికల బరిలో ఉండటంతో వారిని విరమించేందుకు అగ్రనాయకత్వం బుజ్జగింపులు చేపట్టింది.సికింద్రాబాద్ ఈసారి ముగ్గురిలో మొగ్గు ఎవరి వైపు అంటే?
తెలంగాణ ఎన్నికల్లో ఈసారి గెలుపోటములు దోబూచులాడుతున్నాయి. ఎవరిది విజయమో.. ఎవరిని అపజయం వెంటాడుతుందో తెలియని పరిస్థితి. వేవ్ ఉన్నట్లే కనిపిస్తున్నప్పటికీ సైలెంట్ ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందన్న ఆందోళన అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ ఉంది.స్టేజీపై క్లాసికల్ డాన్స్‌తో అదరగొట్టిన సుమ..
తెలుగు వారిని పండుగ సమయంలో, సినిమా రిలీజ్లు సమయంలో, ప్రత్యేక ఈవెంట్స్ టైములో ముందుగా పలకరించే అతిథి యాంకర్ సుమ. ఆమె లేకుండా టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ జరగడం చాలా కష్టం. మలయాళీ అమ్మాయి అయిన సుమ.. తెలుగులో పలు సీరియల్స్, సినిమాల్లో నటించి యాంకర్ గా స్టార్ మహిళ అనిపించుకున్నారు.Next Story