Fri Dec 20 2024 09:02:50 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్ 16-10-23
షిఫ్టింగ్ విషయంలో వెనక్కు తగ్గని సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో పర్యటించారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన అందించనున్నట్లు స్పష్టం చేశారు. డిసెంబరు నెల లోపు ఈ మార్పు ఉంటుందని ప్రకటించారు.మంటలు పుట్టిస్తున్న కాంగ్రెస్ తొలి జాబితా
కర్నాటక ఫార్ములా అమలు చేశారు.. బీజేపీ ప్లాన్‌ను ఫాలో అయ్యారు. ఎట్టకేలకు విజయవంతంగా మొదటి జాబితాను విడుదల చేశారు. అయితే మొదటి జాబితా ఇప్పుడు తెగ మంటలు రేపుతోంది. ఆ చిచ్చుతో ఏకంగా గాంధీ భవన్‌కే తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ కాంగ్రెస్ తొలి జాబితా..అసదుద్దీన్ ప్రశంసలు మామూలుగా లేవుగా!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోరాడనున్నాయి. ఈ సమయంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.ఐఓసీ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందోచ్
లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను కూడా చేర్చేశారు. క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చడం గురించి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. 128 ఏళ్ల తర్వాత మళ్లీ క్రికెట్ ఒలింపిక్స్‌లో భాగం కానుంది. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోసీ క్రీడలను కూడా 2028 ఒలింపిక్స్‌లో చేర్చారు.అక్టోబర్ 21: మిషన్ 'గగన్ యాన్' కు ఎంతో కీలకం
అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపే గగన్‌యాన్ మిషన్ లో అక్టోబర్ 21న కీలక అడుగు ముందుకు పడనుంది. టీవీ-డీ1 టెస్ట్ ఫ్లయిట్‌ను అక్టోబర్ 21వ తేదీన నిర్వహించనున్నారు. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలో పరీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇస్రో తెలిపింది.26 సంవత్సరాలకే కన్నుమూసిన షెరికా
మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్ కన్నుమూశారు. ఆమె వయసు 26 సంవత్సరాలు. గత కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. షెరికా సొంత దేశం ఉరుగ్వే. కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో దాదాపు రెండేళ్లపాటు పోరాడింది షెరికా.బీఆర్ఎస్ మేనిఫేస్టోతో భగ్గుమన్న కాంగ్రెస్.. కారణం ఏంటంటే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ హడావుడి ఊపందుకుంది. వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు జాబితాను విడుదల చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వారు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే అలాగే ఎన్నికల సందర్భంగా పార్టీలో తమతమ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి.చంద్రబాబుకు మద్దతుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేశారని కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు చింతామోహన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్న ఆయన న్యాయస్థానాల్లోనూ రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తుందని అభిస్రాయం వ్యక్తం చేశారు.
టైగర్ నాగేశ్వరరావు, క్రాక్ మధ్య కనెక్షన్.. రియల్ లైఫ్‌లో ఢీ కొట్టుకున్న దొంగ-పోలీస్.
రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'.. 19వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ స్టూవర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక గతంలో రవితేజ నటించిన 'క్రాక్' సినిమా కూడా ఒంగోలు ప్రాంతంలోని కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆధారంగానే తెరకెక్కింది.KCR Strategies : మూడో టర్మ్ అధికారం కోసం 8 ఎత్తుగడలు ఏమై ఉండొచ్చు.. ఒక అంచనా..!
తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో అసంతృప్తి తారా స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో అధికార పార్టీకి తిరిగి గద్దెను దక్కించుకోవడం ఎలా అనేది యక్ష ప్రశ్నగా మారింది. ఎన్నికలు అనౌన్స్ అవడానికి ఇరవై రోజుక ముందే కేసీఆర్ 115 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసి చాలా అడ్వాన్స్డ్ గా దూసుకుపోయారు.Next Story