Fri Dec 20 2024 08:16:29 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఏం ప్లాన్‌రా బాబు.. పుష్ప సినిమాను మించిన హైటెక్ స్మగ్లింగ్
ఏం ఐడియారా బాబు.. చేసే పని దొంగ పని అయినా హైటెక్‌గా చేసేస్తున్నారు చాలా మంది. ఎవ్వరికి అనుమానం రాకుండా కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక పుష్ప సినిమా తలపించే విధంగా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా హైటెక్ స్మగ్లర్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.. వారి ప్లాన్ చూసి పోలీసులు సైతం నివ్వెరపోయారు.దసరా బాక్సాఫీస్ రిలీజ్స్.. థియేటర్, ఓటీటీలోకి రానున్న చిత్రాలివే..
ఈ దసరా పండగా ప్రేక్షకులకు ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని ఇవ్వనుంది. స్టార్ హీరోల నుంచి మోస్ట్ హైపెడ్ అండ్ అవైటెడ్ మూవీస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల నుంచి సినిమాలు వస్తుంటే.. డబ్బింగ్ ద్వారా మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.జీజే రెడ్డిని రామోజీరావు ఎలా మోసం చేశారంటే?
కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన జీజే రెడ్డి ..జెకోస్లోవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఢిల్లీ కేంద్రంగా నవభారత్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలను స్థాపించారు. కృష్ణా జిల్లాకు చెందిన పెదపారుపూడి రామోజీ సొంత గ్రామం. కమ్యూనిస్ట్ నేత కొండపల్లి సీతారామయ్య ..రామోజీకి ఉద్యోగం ఇవ్వాలని జీజే రెడ్డికి సిఫార్సు చేశారు.బావాబామ్మర్దులపై పోటీకి కాంగ్రెస్ చేస్తున్న కసరత్తు ఇదేనా?
కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. అందులో ముఖ్యమైన నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. చివరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ కు కూడా అభ్యర్థిని కాంగ్రెస్ అధినాయకత్వం త్వరగానే కన్ఫర్మ్ చేసింది. కేసీఆర్ పై నరసారెడ్డిని పోటీకి దింపేందుకు సిద్ధమయ్యారు.పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వేధిస్తున్నారు.. అమర్ దీప్ తల్లి ఆవేదన..
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఆరు వారాలు పూర్తి చేసేసుకొని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. గత వరం ఎలిమినేషన్ తో నయని పావని బయటకి వచ్చేయగా.. ఇప్పుడు హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక హౌస్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది.స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత లేదు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని న్యాయస్థానం నిర్ణయించదని.. సేమ్ సెక్స్ మ్యారేజ్ లకు గుర్తింపు, చట్టబద్ధత కల్పించే అధికారం పార్లమెంట్ దేనని స్పష్టతనిచ్చింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.అతడి వల్లే: ప్రవళిక కుటుంబసభ్యులు
గ్రూప్ 2 అభ్యర్ధి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని చెబుతూ ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని తెలిపారు. ఆత్మహత్యకు శివరామే కారణమని తన బిడ్డ చావుకు కారణమైన శివరామ్‌కు ఉరిశిక్ష వేయాలని ప్రవళిక తల్లి ప్రభుత్వాన్ని కోరారు.ఏపీలో ఉన్నా పోయేదే... తెలంగాణలో ఇలా అయిందేంటబ్బా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఒక ఊపు ఊపిన నేతలు అనుకుంటున్న మాట ఇది. తెలంగాణలో కీలక నేతలు కొందరు రాజకీయంగా కనుమరుగు కాగా, ఏపీలో మాత్రం ఇప్పటికీ కళకళలాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాజకీయంగా నష్టపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారు.నన్ను కలవడానికి వస్తే తప్పేమిటి?
తనను కలిసేందుకు వస్తున్న పార్టీ నేతలను పోలీసులు బెదిరించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఆమె ట్వీట్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా తనను రాజమండ్రిలో కలిసేందుకు వస్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.కమ్యునిస్టులకు ఇప్పటి వరకూ అయితే సీట్లు... ఫ్రెండ్లీ కంటెన్ట్ అంటూ
తెలంగాణలో కాంగ్రెస్, కమ్యునిస్టులకు మధ్య పొత్తు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. కామ్రేడ్లకు కేవలం మూడు సీట్లను మాత్రమే కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధమయింది. సీపీఐకి రెండు, సీపీఎంకు ఒక్క స్థానాన్ని కేటాయించడానికి రెడీ అయింది. అయితే ఇందుకు మాత్రం కమ్యునిస్టు పార్టీలు ససేమిరా అంటున్నాయని తెలిసింది.Next Story