Thu Dec 19 2024 18:58:14 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
Priyanka Gandhi : నేడు తెలంగాణకు ప్రియాంక
Priyanka Gandhi : నేడు తెలంగాణకు ప్రియాంక
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణ ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగా ప్రియాంక నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు
Liquor Shops : నేడు లిక్కర్ షాపులు బంద్
దేశ రాజధాని ఢిల్లీలో నేడు మద్యం విక్రయాలను బంద్ చేశారు. మద్యం దుకాణాలను బంద్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఛాత్ పూజల కారణంగానే మద్యం అమ్మకాలపై ఈరోజు నిషేధం విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఛాత్ పూజను ఢిల్లీలో విశేషంగా జరుపుకుంటారు.
BJP : నేడు మూడు సభల్లో జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణకు రానున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మొత్తం మూడు సభల్లో నడ్డా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
World Cup Finals 2023 : గెలుపు గ్యారంటీ... అంచనాలు అధికం.. ప్రత్యేక పూజలు
నేడు భారత్ - ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్స్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా భారత్ లో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంకొద్ది గంటల్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇండియా మొత్తం క్రికెట్ ఫీవర్ అలుముకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే అనేక మంది అక్కడకు చేరుకున్నారు
YSRCP : పురంద్రీశ్వరిపై విజయసాయిరెడ్డి మరోసారి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరిని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేస్తున్నారు.
Ritu Varma : మెగా హీరోతో రీతూ వర్మ రిలేషన్..?
తెలుగు అమ్మాయి రీతూ వర్మ.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ బాద్షా సినిమాలో హీరోయిన్ కాజోల్ పక్కన నటించి అందరి దృష్టిని ఆకర్షించారు.
Vijayasanthi : పేరులో ఉన్న రెండూ ఉండవా? ఇన్ని పార్టీలు మారితే ఫలితం ఉంటుందా?
సినీనటి విజయశాంతి మళ్లీ పార్టీ మారారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. పార్టీలు మారడం ఆమె గతంలో సినిమాలకు కాల్షీట్లు ఇచ్చినంత తేలిగ్గా తీసుకుంటున్నారన్న కామెంట్స్ బాగా వినపడుతున్నాయి. సినిమాల్లో తన పేరులో ఉన్న విజయాన్ని సొంతం చేసుకున్న విజయశాంతి రాజకీయాల్లో మాత్రం సాధించుకోలేకపోయారు.
ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చే వారు అధికారుల కళ్లుగప్పి తీసుకువచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.అయినా చివరికి విమానాశ్రయంలో పట్టుబడిపోతారు.
World Cup Finals 2023 : సమర్పించుకున్నట్లేనా.. రన్ రేటు తక్కువ.. బౌలర్లపైనే ఇక భారమంతా
అందరి అంచనాలకు భిన్నంగా ఆట మొదలయింది. టీం ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. వరస పెట్టి అవుట్లవుతూ ఆస్ట్రేలియా బౌలర్ల చేతికి చిక్కుతున్నారు. ఐదు వికెట్లు కోల్పోయిన టీం ఇండియా కష్టాల్లోనే ఉందని చెప్పాలి. ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసిస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
KCR : మోస పోతే గోసపడతాం.. జాగ్రత్తగా ఓటేయ్యండి
కాంగ్రెస్ కు ఓటేస్తే పాతపద్ధతి వస్తుందని, ప్రజలు ఆగమాగం అవుతారని అన్నారు. కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని తెలిపారు. ధరణి లేకుంటే రైతు బంధు డబ్బులు ఖాతాల్లో పడటం కష్టమని తెలిపారు.
Next Story