Fri Dec 20 2024 08:54:56 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
గాయంతో గ్రౌండ్ నుండి వెళ్ళిపోయిన హార్దిక్
వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచులో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం కావడంతో నొప్పితో మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచులో హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేసేందుకు వచ్చాడు. తొలి ఓవర్ మూడో బంతి వేయగా..వెకేషన్ బెంచ్ కు బదిలీ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని హైకోర్టును చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి వెకేషన్ బెంచ్ కు విచారణను బదిలీ చేశారు.సినిమాలు చేయని రేణూదేశాయ్కి సంపాదన ఎలా వస్తుందో తెలుసా..?
పవన్ కళ్యాణ్ తో విడాకులు తరువాత రేణూదేశాయ్.. ఒంటరిగానే బ్రతుకుతుంది. అంతేకాదు వారిద్దరి పిల్లలు భాద్యత కూడా ఆమె తీసుకుంది. అకీరా నందన్, ఆద్య ఆమె దగ్గరే ఉండి చదువుకుంటున్నారు. ఇక 2003లో వచ్చిన 'జానీ' మూవీ తరువాత రేణూదేశాయ్.. సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చింది.Breaking : చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. నవంబరు 1వ తేదీ వరకూ చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈరోజుతో చంద్రబాబు రిమాండ్ ముగియడంతో ఆయనను వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు
బీజేపీ, కాంగ్రెస్లకంటే నా రాయల్ ఎన్ఫీల్డ్కే సీట్లెక్కువ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమను బీజేపీ బీ టీం అంటూ రాహుల్ బాబా పదే పదే చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీ టీం అయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎందుకింత బలహీనంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.'భయమేస్తోంది..' బంగ్లాదేశ్ హెడ్ కోచ్
ప్రత్యర్థులు మనల్ని చూసి భయపెడితే ఆ వచ్చే కిక్కే వేరు. అప్పుడప్పుడూ ఆశ్చర్యపోయే విజయాలు నమోదు చేసే బంగ్లాదేశ్ ప్లేయర్లు మన క్రికెట్ టీమ్ ఆట తీరు చూసి భయపడుతున్నారు. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్కోచ్ చంద్రికా హతురుసింగా స్వయంగా చెప్పారు. ‘వాళ్ల దగ్గర మంచి బౌలర్లు ఉన్నారు.'పుష్ప ది రూల్'.. ఓ ఎమోషనల్ జర్నీ..?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప గురించి ఉపోద్ఘాతం వేరే అక్కర్లేదు. పాన్ ఇండియా సినిమాగా వచ్చి, అల్లు అర్జున్ని ఓవర్ నైట్ ఐకాన్ స్టార్ చేశాడు పుష్పరాజ్. ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకుని తన కీర్తి కిరీటంలో మరో మణిమాణిక్యాన్ని అమర్చుకున్నాడు అల్లువారి వారసుడు. పూర్తి రస్టిక్ సినిమాగా తెరకెక్కిన పుష్ప ప్రేక్షకులని ఆశ్చర్యంలో ముంచెత్తింది.కేసీఆర్ ఓటమి ఖాయం.. రాసిపెట్టుకోండి : రాహుల్
కేసీఆర్ ఓటమి ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆయనక కాటారంలో మాట్లాడారు. పదేళ్లుగా కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని రాహుల్ అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు తెరదించాలని ఆయన పిలుపు నిచ్చారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతుందన్నారు.Breaking : చంద్రబాబు బెయిల్ పిటీషన్ వాయిదా
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. లంచ్ బ్రేక్ తర్వాత విచారిస్తామని తెలిపింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరుపున సిద్ధార్థ లూథ్రా తన వాదనలను వినిపించారు.ఆ ముగ్గురినీ కట్టడి చేయగలిగితేనే?
మరికాసేపట్లో ఇండియా - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. పూనే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బంగ్లాదేశ్ మీద గెలిచి సెమీస్కు వెళ్లేందుకు మార్గం మరింత సుగమం చేసుకోవాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు.Next Story